Andhra Pradesh High Court Division
-
హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారంలో సీఎం జగన్ (ఫొటోలు)
-
పరిషత్ ఎన్నికలు: సింగిల్ బెంచ్ ఆదేశాలను సవాల్ చేస్తూ ఎస్ఈసీ పిటిషన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రద్దును సవాల్ చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇదే విషయమై గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ.. ఎస్ఈసీ డివిజన్ బెంచ్కు వెళ్లింది. నిబంధనల ప్రకారమే ఎన్నికలు నిర్వహించామని ఎస్ఈసీ తమ పిటిషన్లో పేర్కొంది. ఎన్నికల నిర్వహణలో సుప్రీం ఆదేశాలను తూచా తప్పకుండా పాటించామని తెలిపింది. కాగా, ఏపీలో పరిషత్ (ఎంపీటీసీ, జడ్పీటీసీ) ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ మే 21న తీర్పును వెలువరించింది. పరిషత్ ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని ఎస్ఈసీని ఆదేశించింది. -
‘ఎన్నికలు జరపమని డివిజన్ బెంచే తీర్పు చెప్పింది’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పరిషత్ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. హైకోర్టు తీర్పు దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఎన్నికలు జరపమని గతంలో ఇదే డివిజన్ బెంచ్ తీర్పు చెప్పిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ తీర్పు ఆధారంగానే రాష్ట్ర ఎన్నికల కమీషన్ (ఎస్ఈసీ) ఎన్నికలు నిర్వహించిందని పేర్కొన్నారు. ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పుడు కరోనా పేరుతో ఎన్నికలు వాయిదా వేసిన విషయాన్ని గుర్తు చేశారు. కాగా, ప్రజాక్షేత్రంలో గెలవలేమని తెలుసుకున్న టీడీపీ దుర్మార్గపు ఎత్తుగడలు వేస్తుందని, అందులో భాగంగా కోర్టుల్లో కేసులు వేస్తూ పాలనకు అడ్డు తగులుతుందని ఆరోపించారు. ప్రతిపక్ష నేతలు చిల్లర రాజకీయాలు చేస్తూ సంబరపడుతున్నారని, వారు ఎన్ని కుట్రలు పన్నినా అంతమ విజయం తమదేనని సజ్జల పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా తాము సిద్ధమని, ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతారని జోస్యం చెప్పారు. చంద్రబాబు డైరెక్షన్లో డ్రామాకు తెరలేపారు.. రఘురామకృష్ణరాజుపై నమోదైన సీఐడీ కేసులో ఎలాంటి అభ్యంతరాలు లేవని సజ్జల స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేశారో ప్రజలందరు గమనించారని, ఈ డ్రామా మొత్తం చంద్రబాబు డైరెక్షన్లోనే సాగిందని ఆయన ఆరోపించారు. రఘురామకృష్ణరాజును రమేష్ ఆస్పత్రికి పంపలేదని ఎలా అడుగుతారని, అసలు రమేష్ ఆస్పత్రిలోనే పరీక్షలు ఎందుకు చేయాలి ప్రశ్నించారు. గుంటూరు నుంచి సికింద్రాబాద్ వెళ్లేటప్పుడు ఆయన సొంత వాహనంలో వెళ్లారని, ఆ సమయంలో ఏదైనా జరిగి ఉండొచ్చన్న అనుమానానన్ని వ్యక్తం చేశారు. అతని కాలు నిజంగా ఫ్రాక్చర్ అయితే కారులో కాళ్లు, చేతులు చూపిస్తూ విన్యాసాలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. బెయిల్ రిజక్ట్ అయ్యి రాజద్రోహం కేసు నిలబడుతుందనే భయంతోనే ఆయన ఈ డ్రామాలన్నింటికీ తెరలేపుతున్నాడని ఆరోపించారు. -
'విభజన ఆలస్యంతో అనుమానాలు'
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టును విభజించాలని కోరుతూ తెలంగాణ ప్రతినిధులు మంగళవారం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు. హైకోర్టు విభజన ఆలస్యం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య మనస్పసర్థలు, అనుమానాలు తలెత్తుతాయని రాజ్ నాథ్ కు తెలిపారు. న్యాయశాఖ మంత్రితో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని రాజ్ నాథ్ హామీయిచ్చారని తెలంగాణ ప్రతినిధులు తెలిపారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు కారణంగా హైకోర్టు విభజన ఆలస్యం అవుతుందనే అభిప్రాయంతో కేంద్రం ఉందని చెప్పారు. కేంద్రం ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసి అటార్నీ జనరల్ ద్వారా వాదనలు వినిపించాలని కోరినట్టు వెల్లడించారు. రాజ్ నాథ్ ను కలిసిన వారిలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, ప్రొఫెసర్ కోదండరాం, లాయర్ రాజేందర్ రెడ్డి ఉన్నారు. -
హైకోర్టు విభజనపై కాంగ్రెస్, టీఆర్ఎస్ల వాగ్వివాదం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విభజన అంశంపై మంగళవారం రాజ్యసభలో కాంగ్రెస్, టీఆర్ఎస్ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టును డిమాండ్ చేస్తూ జీరో అవర్ సందర్భంగా టీఆర్ఎస్ సభ్యుడు కె.కేశవరావు ఈ అంశాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం ఏపీ హైకోర్టులో 19 మంది జడ్జీలు ఆంధ్రప్రదేశ్కు చెందినవారు ఉండగా, తెలంగాణవారు ఆరుగురే ఉన్నారని తెలిపారు. తెలంగాణ వాటా పోస్టులను వెల్లడించకుండానే జూనియర్ సివిల్ జడ్జీల నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని తెలంగాణ బార్ సభ్యులందరూ వ్యతిరేకిస్తున్నారన్నారు. అయితే కేకే వాదనను కాంగ్రెస్ సభ్యులు జేడీ శీలం, వీహెచ్ వ్యతిరేకించారు. ఇరు పార్టీల సభ్యుల మధ్య వాదోపవాదాలు తీవ్రమై గందరగోళం నెలకొంది. దీంతో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ జేడీ శీలంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇలాగైతే మీపై చర్య తీసుకోవాల్సి ఉంటుంది’ అని హెచ్చరించారు.