సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు మాస్క్ ధరించి ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. భారీ భద్రత నడుమ ఓటింగ్ సరళి సజావుగా సాగుతోంది. అయితే ఎన్నికల నిర్వహణను జీర్ణించుకోలేని టీడీపీ పలుచోట్ల దౌర్జన్యానికి తెగబడుతోంది. వైఎస్సార్ జిల్లా చాపాడు మండలం అయ్యవారిపల్లెలో టీడీపీ అభ్యర్థి రాజేశ్వరి వీరంగం సృష్టించారు. ఓటు వేయడం తెలియని ఓ వృద్ధురాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తోందంటూ బ్యాలెట్ పేపర్‌ను బయటకు తీసుకువచ్చారు.
ఇక రాజేశ్వరి దౌర్జన్యాన్ని పోలీసులు అడ్డుకోవడంతో వారితో ఆమె వాగ్వాదానికి దిగారు. దీంతో పోలింగ్ కేంద్రంలో కాసేపటి వరకు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా పరిషత్ ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ నెల 1న జారీ చేసిన నోటిఫికేషన్‌లో తదుపరి చర్యలన్నీ నిలిపివేస్తూ సింగిల్ జడ్జి మంగళవారం జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో, షెడ్యూల్ ప్రకారం ఈ ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది. 515 జెడ్పీటీసీ, 7220 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
జిల్లాల వారీగా పోలింగ్ జరిగే స్థానాలు
శ్రీకాకుళం: 37 జెడ్పీటీసీ, 590 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్
విజయనగరం: 31 జెడ్పీటీసీ, 487 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్
విశాఖపట్నం: 37 జెడ్పీటీసీ, 612 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్
తూర్పు గోదావరి: 61 జెడ్పీటీసీ, 1000 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్
పశ్చిమగోదావరి: 45 జెడ్పీటీసీ, 781 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్
కృష్ణా: 41 జెడ్పీటీసీ, 648 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్
గుంటూరు: 45 జెడ్పీటీసీ, 571 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్
ప్రకాశం: 41 జెడ్పీటీసీ, 387 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్
నెల్లూరు: 34 జెడ్పీటీసీ, 362 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్
చిత్తూరు: 33 జెడ్పీటీసీ, 419 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్
వైఎస్‌ఆర్ జిల్లా: 12 జెడ్పీటీసీ, 117 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్
కర్నూలు: 36 జెడ్పీటీసీ, 484 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్
అనంతపురం: 62 జెడ్పీటీసీ, 782 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్
Comments
Please login to add a commentAdd a comment