సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల వేళ ఎలక్షన్ కమిషన్ డూప్లికేట్ ఓట్లపై ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ నగరంలో రికార్డు స్థాయిలో డూప్లికేట్ ఓట్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం గుర్తించింది. ఈ క్రమంలో తెలంగాణలో ఉన్న 33 లక్షల ఓటర్లను తొలగించింది. ప్రధానంగా హైదరాబాద్ జిల్లాలో 5 లక్షల డూప్లికేట్ ఓట్లు తొలగించినట్లు ఈసీ పేర్కొంది.
హైదరాబాద్‌లో అత్యధికంగా జూబ్లీహిల్స్, చాంద్రాయణగుట్టలో డూప్లికేట్ ఓట్లు ఉన్నట్లు ఈసీ గుర్తించింది. ఇక.. రాష్ట్ర వ్యాప్తంగా గత రెండేళ్లలో 32.8 లక్షల మంది ఓటర్లను తొలగించినట్లు ఈసీ పేర్కొంది. మరోవైపు.. గత రెండేళ్లలో దాదాపు 60.6 లక్షల మంది కొత్త ఓటర్లు చేరినట్లు సీఈఓ వికాస్ రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు.
జూబ్లీహిల్స్, చంద్రయాన్‌గుట్ట-61వేలు, ముషీరాబాద్, మలక్ పేట్- నాంపల్లి, బహదూర్‌పూర్‌లో 41వేల డూప్లికేట్ ఓట్లు, యాకుత్పురాలో-48 వేలు ఉన్నట్లు గుర్తించినట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ చెప్పారు. ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే 53,000 షిఫ్టెడ్ ఓట్లు ఉన్నట్లు ఎన్నికల అధికారులు గుర్తించారు చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురాలో వరుసగా 59,289 ఓట్లు, 48,296 డూప్లికేట్ ఓట్లు గుర్తించామని ఎన్నికల సంఘం వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment