Duplicate votes removal
-
TS: డూప్లికేట్ ఓట్లపై ఫోకస్.. ఈసీ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల వేళ ఎలక్షన్ కమిషన్ డూప్లికేట్ ఓట్లపై ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ నగరంలో రికార్డు స్థాయిలో డూప్లికేట్ ఓట్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం గుర్తించింది. ఈ క్రమంలో తెలంగాణలో ఉన్న 33 లక్షల ఓటర్లను తొలగించింది. ప్రధానంగా హైదరాబాద్ జిల్లాలో 5 లక్షల డూప్లికేట్ ఓట్లు తొలగించినట్లు ఈసీ పేర్కొంది. హైదరాబాద్‌లో అత్యధికంగా జూబ్లీహిల్స్, చాంద్రాయణగుట్టలో డూప్లికేట్ ఓట్లు ఉన్నట్లు ఈసీ గుర్తించింది. ఇక.. రాష్ట్ర వ్యాప్తంగా గత రెండేళ్లలో 32.8 లక్షల మంది ఓటర్లను తొలగించినట్లు ఈసీ పేర్కొంది. మరోవైపు.. గత రెండేళ్లలో దాదాపు 60.6 లక్షల మంది కొత్త ఓటర్లు చేరినట్లు సీఈఓ వికాస్ రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. జూబ్లీహిల్స్, చంద్రయాన్‌గుట్ట-61వేలు, ముషీరాబాద్, మలక్ పేట్- నాంపల్లి, బహదూర్‌పూర్‌లో 41వేల డూప్లికేట్ ఓట్లు, యాకుత్‌పురాలో-48 వేలు ఉన్నట్లు గుర్తించినట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ చెప్పారు. ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే 53,000 షిఫ్టెడ్ ఓట్లు ఉన్నట్లు ఎన్నికల అధికారులు గుర్తించారు చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురాలో వరుసగా 59,289 ఓట్లు, 48,296 డూప్లికేట్ ఓట్లు గుర్తించామని ఎన్నికల సంఘం వెల్లడించింది. -
‘దొంగఓట్లపై విచారణ జరిపించండి’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో దొంగఓట్లను అరికట్టి, స్వేచ్ఛగా, జవాబుదారీతనంతో, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆర్పీ సిసోడియాకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు, ఆ పార్టీ ముఖ్య నాయకులు సోమవారం ఎన్నికల ప్రధానాధికారిని కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఓట్ల గల్లంతు, ఓట్ల డూప్లికేషన్, దొంగ ఓట్లపై సమీక్షించాలని కోరామని తెలిపారు. తమ దగ్గర ఉన్న ఆధారాలను ప్రధానాధికారికి సమర్పించామని, రాష్ట్రంలో దాదాపు 34 లక్షల డూప్లికేషన్ ఓట్లు ఉన్నాయని వెల్లడించారు. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రెండు చోట్లా 18 లక్షల మంది ఓట్లు కలిగి ఉన్నారని ఆరోపించారు. వీటన్నింటిపై విచారణ జరిపించాలని కోరగా సీఈఓ సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. -
ఎన్నికల తర్వాతే డూప్లికేట్ ఓట్ల తొలగింపు
♦ హైకోర్టుకు నివేదించిన సీఈసీ ♦ వ్యాజ్యాలను పరిష్కరించినట్లు కోర్టు ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితాలో ఉన్న 7.9 లక్షల డూప్లికేట్ పేర్లను స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత తొలగిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) శుక్రవారం హైకోర్టుకు నివేదించింది. సీఈసీ రాతపూర్వకంగా చేసిన ఈ ప్రకటనను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, 6.3 లక్షల ఓటర్ల తొలగింపుపై తుది నిర్ణయం తీసుకునే వరకు వార్డుల ఖరారుపై ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన వ్యాజ్యాలను పరిష్కరించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నిమిత్తం బీసీ ఓటర్ల జాబితాను లెక్కించి వార్డులను ఖరారు చేసే దిశగా ప్రభుత్వం ముందుకెళుతోందని, తొలగించిన 6.3 లక్షల ఓటర్ల విషయంలో తుది నిర్ణయం జరిగే వరకు వార్డుల ఖరారుపై ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా ఆదేశాలివ్వాలని కాంగ్రెస్ నేత నాగేశ్ ముదిరాజ్, టీడీపీ కార్యదర్శి ఫిరోజ్‌ఖాన్‌లు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలను ఇప్పటికే పలుమార్లు విచారించిన న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి శుక్రవారం మరోసారి విచారించారు. సీఈసీ తరఫు న్యాయవాది అవినాశ్ దేశాయ్ స్పందిస్తూ సాప్ట్వేర్ ద్వారా బయటపడ్డ 7.9 లక్షల డూప్లికేట్ పేర్లను ఇప్పటికిప్పుడు తొలగించడం లేదని, స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన తర్వాతే చేపడతామని తెలిపారు.