
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో వరద సాయానికి బ్రేక్ పడింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు మంగళవారం నగారా మోగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియామవళి(మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) అమల్లోకి రావడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రభుత్వం అమలు చేస్తోన్న వరద సాయం కోసం దరఖాస్తుల స్వీకరణ, పంపిణీని నిలిపివేయాలని ఆదేశించింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఈ పథకాన్ని యథావిధిగా కొనసాగించుకోవచ్చని ఎస్‌ఈసీ స్పష్టం చేసింది. కాగా నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జనజీవనం అతలాకుతలమైన విషయం విదితమే. వరదలు ముంచెత్తడంతో చాలా మంది ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులు కాగా, ఎంతో మందికి భారీగా ఆస్తి నష్టం జరిగింది. (చదవండి: ‘టీఆర్‌ఎస్ ఇచ్చే డబ్బులు ఏ మూలకు సరిపోవు’)