AP MPTC And ZPTC Election 2021 Results Live - Sakshi
Sakshi News home page

AP MPTC And ZPTC Election 2021 Results Live: కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

Published Thu, Nov 18 2021 3:23 AM | Last Updated on Thu, Nov 18 2021 5:42 PM

AP MPTC And ZPTC Elections 2021 Results Live Updates - Sakshi

AP MPTC And ZPTC Election Live Updates

05:30PM
సాయంత్రం 5.30 గంటల వరకు వెలువడిన జెడ్పీటీసీ ఫలితాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 11, టీడీపీ 3 స్థానాలు గెలుచుకున్నాయి. ఇందులో నాలుగు స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన పదిస్థానాలకు ఎన్నికలు జరిగాయి.

ఎంపీటీసీ ఫలితాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏకగ్రీవాలతో కలిపి 127, టీడీపీ 32, బీజేపీ 6, ఇతరులు 4స్థానాలను గెలుచుకున్నారు. మొత్తం 123 స్థానాలకు ఎన్నికలు జరగగా మరో 50 స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి.

03:18PM
పశ్చిమగోదావరి జిల్లా
ఎన్నిక జరిగిన పెనుగొండ జడ్పీ స్థానాన్ని వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది.
ఎన్నికలు జరిగిన ఎంపీటీసీ స్థానాలు-14
వైఎస్సార్‌సీపీ-10
టీడీపీ-3
జనసేన-1

03:05PM
తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం ఎన్నికలు జరిగిన ఎంపీటీసీ స్థానాలు - 21
వైఎస్సార్‌సీపీ - 9
టీడీపీ - 6
జనసేన - 3
ఇండిపెండెంట్‌ - 1
సీపీఎం - 1
సీపీఐ - 1

02:50PM
తూర్పుగోదావరి జిల్లా
ఏటపాక మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలకు ముగిసిన ఓట్ల లెక్కింపు..
12 ఎంపీటీసీ స్థానాలు ఏటపాక మండలంలో ఉండగా కన్నాయిగూడెం ఎంపీటీసీ స్థానం వైఎస్సార్‌సీపీ ఏకగ్రీవం .

ఎన్నికలు జరిగిన 11 స్థానాల్లో..
 ఏటపాక - వైఎస్సార్‌సీపీ
 రాయనపేట - వైఎస్సార్‌సీపీ
 నెల్లిపాక - వైఎస్సార్‌సీపీ
 గుండాల - వైఎస్సార్‌సీపీ
 లక్ష్మీపురం - వైఎస్సార్‌సీపీ
 చోడవరం - టీడీపీ
 గొమ్ముకొత్తగూడెం - టీడీపీ 
 నందిగామ - టీడీపీ 
 టీపీ వీడు - టీడీపీ 
 కృష్ణవరం - సీపీఐ
 విస్సాపురం - సీపీఎం 

మొత్తం 12 ఎంపీటీసీ స్థానాలకు గాను వైఎస్సార్‌సీపీ 6, సీపీఎం 1, సీపీఐ 1, టీడీపీ 4 గెలుచుకున్నాయి.

02:45PM
కృష్ణా జిల్లా
విస్సన్నపేట జడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ కైవసం 
విస్సన్నపేట జడ్పీటీసీగా భారీ మెజార్టీతో గెలుపొందిన భీమిరెడ్డి లోకేశ్వరరెడ్డి 
లోకేశ్వరరెడ్డికి మిఠాయి తినిపించి అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి

అనంతపురం: హిందూపురం నియోజకవర్గంలో గెలుపొందిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను ఎమ్మెల్సీ ఇక్భాల్, గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ ఎల్ఎం మోహన్ రెడ్డి అభినందించారు.

02:35PM
విశాఖపట్నం
టీడీపీ కంచుకోట ఆనందపురం జడ్పీటీసీగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కోరాడ వెంకట్రావు ఘన విజయం
1983 జిల్లా పరిషత్‌ ఆవిర్భావం నుంచి ఆనందపురంలో టీడీపీ అభ్యర్థులదే గెలుపు
తొలిసారి 3576 ఓట్లతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కోరాడ వెంకట్రావు జడ్పీటీసీగా విజయం
ఆనందపురంలో టీడీపీ కంచుకోట శిథిలమైంది
ఇది సీఎం జగన్‌కి కృతజ్ఞతగా ప్రజలు ఇచ్చిన గెలుపు
 - భీమిలి వైఎస్సార్‌సీపీ ఇన్ఛార్జ్‌ ముత్తంశెట్టి మహేష్‌

02:30PM
అనంతపురం జిల్లా
చిలమత్తూరు వైఎస్సార్‌ సీపీ జడ్పీటీసీ అభ్యర్థి అనూష  3,025 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

02:20PM
నెల్లూరు జిల్లా 
ముగిసిన కోట ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ 
వైఎస్సార్‌సీపీ అభ్యర్థి షేక్ మొబీన్  భాష విజయం సాధించారు.

1.52PM
ప.గో జిల్లాలో ముగిసిన పరిషత్ ఎన్నికల కౌంటింగ్
15 ఎంపీటీసీ స్థానాలకు గాను తాళ్ళపూడి (మం) వేగేశ్వరపురం ఎంపీటీసీ- 2 వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కొమిరెడ్డి వీర రాఘవమ్మ ఏకగ్రీవం కాగా 14 ఎంపీటీసీ, పెనుగొండ జడ్పీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికలు
10 ఎంపీటీసీ స్థానాలు, పెనుగొండ జెడ్పీ స్థానాన్ని కైవసం చేసుకున్న వైఎస్సార్‌సీపీ
జనసేన-1,టీడీపీ-3 ఎంపీటీసీ స్థానాలకు పరిమితం
పెనుగొండ జడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పోడూరి గోవర్ధని 4,300 ఓట్లు మెజారిటీ తో గెలుపు
అత్తిలి(మం)పాలూరు ఎంపీటీసీ  వైఎస్సార్‌సీపీ అభ్యర్థి  శరఖడం రామలింగ విష్ణు మూర్తి 257 ఓట్ల మెజారిటీతో గెలుపు
అత్తిలి (మం) ఈడూరు ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి  సుంకర నాగేశ్వరరావు 225 ఓట్ల మెజారిటీతో గెలుపు
భీమడోలు (మం) అంబరుపేట ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దాసరి విజయ భాను 10 ఓట్ల మెజార్టీ తో గెలుపు...
చాగల్లు ఎంపీటీసీ - 5 వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఉన్నమట్ల  విజయకుమారి 969 ఓట్ల మెజార్టీతో గెలుపు
దెందులూరు-1 ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తాళ్లూరి నాగరాజు 85 ఓట్ల మెజారిటీతో గెలుపు
దెందులూరు (మం) కొవ్వలి ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి   గొల్ల నాగరాజు 58 ఓట్ల మెజార్టీ తో గెలుపు
జంగారెడ్డిగూడెం (మం) లక్కవరం  ఎంపీటీసీ- 2 వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దల్లి వెంకట మోహన్ రెడ్డి 428 ఓట్ల మెజార్టీ తో  గెలుపు.
కుక్కునూరు (మం) మాధవరం ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కుండా సూర్యనారాయణ182 ఓట్ల మెజారిటీతో  గెలుపు
నిడదవోలు(మం)  తాళ్లపాలెం  ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి బయ్యే కృష్ణబాబు 41 ఓట్ల మెజార్టీతో గెలుపు.
పెరవలి (మం) కానూరు 2 ఎంపిటిసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి  మత్తల ఉషారాణి   256 ఓట్లు మెజార్టీతో గెలుపు
 

1.20PM 
పశ్చిమగోదావరి: 
► పెనుగొండ జడ్పీటీసీ స్థానంలో వైఎస్సార్‌సీపీ విజయం.  వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పోడూరి గోవర్ధని 4,300 ఓట్లు మెజారిటీతో గెలుపు

1.03PM 
కృష్ణా జిల్లా:
 జి.కొండూరు జడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. 4,893 ఓట్ల మెజారిటీతో  మంద జక్రధరరావు విజయం

► విస్సన్నపేట జడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. 9,656 ఓట్ల భారీ మెజార్టీతో భీమిరెడ్డి లోకేశ్వరరెడ్డి విజయం

12.43PM 
► నంద్యాల జడ్పీటీసీ  స్థానాన్ని కైవసం చేసుకున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గోపవరం గోకుల్ కృష్ణ రెడ్డి.

12.20PM
ప్రకాశం జిల్లా 
పర్చూరు మండలం చెరుకూరు-2 ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్ది షేక్ బీస్మల్లా 878 ఓట్ల మోజార్టితో గెలుపు.
పెద్దారవీడు మండలం తంగిరాలపల్లి ఎంపీటీసీ స్థానంలో వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థి ఉప్పలపాటి భాగ్యరేఖ 252 ఓట్ల మెజారిటీతో గెలుపు
► యద్దనపూడి మండలం పోలూరు ఎంపీటీసీగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి షేక్ ఖాసిం వలి 556 ఓట్లతో విజయం
► పీసీపల్లి మండలం మురుగుమ్మి ఎంపీటీసీలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చెరుకూరి సతీష్ 61 ఓట్లతో విజయం

12.00PM
చిత్తూరు:
► కుప్పం నియోజకవర్గంలో కొనసాగుతున్న వైఎస్సార్‌సీపీ ప్రభంజనం
► శాంతిపురం మండలం 64 పెద్దూరులో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ స్థానాన్ని కైవసం చేసు​​కుంది. 

11.54AM
విజయనగరం 
► గరివిడి మండలం వెదురుల్లవలస ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్‌సీపీ  అభ్యర్థి గుడివాడ శ్రీరాములు విజయం
► బలిజిపేట మండలం పెదపెంకి ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గుల్లిపల్లి సునీత 1357 ఓట్ల మెజార్టీతో గెలుపు 
► మెంటాడ మండలం కుంటినవలస ఎంపీటీసీలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రావాడ ఈశ్వర రావు 610 ఓట్లు ఆధిక్యంతో గెలుపు
► నెల్లిమర్ల మండలం బూరాడపేట ఎంపీటీసీలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సంగంరెడ్డి జగన్నాధం గెలుపు

11.48AM
శ్రీకాకుళం
► హిరమండలం మండలం  హిరమండలం 3 ఎంపీటీసీ స్థానంలో  వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మీసాల రజినీ183 ఓట్ల మెజార్టీతో గెలుపు
► టెక్కలి 5వ వార్డు ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బసవల సంధ్యారాణి 897 ఓట్ల మెజారిటీతో గెలుపు
► రేగిడి మండలం ఉంగరాడ ఎంపీటీసీలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పిల్లా రోజా 93 ఓట్ల మెజార్టీతో గెలుపు
బూర్జ మండలం బూర్జ ఎంపీటీసీలో టీడీపీ అభ్యర్థి గెలుపు.
► కొత్తూరు మండలం  దిమిలి ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి గెలుపు
► ఆమదాల వలస మండలం కట్యాచారులుపేట ఎంపీటీసీలో టీడీపీ అభ్యర్థి గెలుపు

11.15AM
శ్రీకాకుళం
► కంచిలి మండలం తలతంపర ఎంపీటీసీలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బృందావన్ సాహు(538) ఓట్ల మెజారిటీతో విజయం 
► కవిటి మండలం కొజ్జిరియా ఎంపీటీసీలో  వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి కందుల దశరథ రావు 145 ఓట్ల మెజారిటీతో విజయం
► సీతంపేట-2 స్థానంలో వైస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి సవర చంద్రశేఖర్ 779 ఓట్ల మెజారిటీతో గెలుపు
► కంచిలి మండలం కుంబరినువంగా ఎంపీటీసీలో టీడీపీ అభ్యర్థి గెలుపు 

11.03AM
గుంటూరు
► ప్రత్తిపాడు మండలం నడింపాలెం-2 ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పూర్ణి వెంకటేశ్వరరావు 200 ఓట్ల మెజారిటీతో గెలుపు.
► బెల్లంకొండ మండలం వెంకటాయపాలెం ఎంపీటీసీగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చిట్టెంశెట్టి శివనాగమణి 587 ఓట్ల మెజారిటీతో గెలుపు.
► వేమూరు-1 వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చెల్లం చర్ల కామేశ్వరి 467 ఓట్ల మెజారిటీతో విజయం
చావలి-2 స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సోమరవుతు జయలక్ష్మి 345 ఓట్ల మెజారిటీతో విజయం. 

10.50AM
విశాఖపట్నం:
► గోలుగొండ మండలం పాకలపాడు ఎంపీటీసీగా వైస్సార్‌సీపీ అబ్యర్ధి ఏళ్ల లక్మి దుర్గ 439 ఓట్లతో గెలుపు
► మాడుగుల మండలం వంటర్లపాలెంలో వైస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి అభ్యర్థి దండి నాగరత్నం 79 ఓట్లు తేడాతో గెలుపు.

చిత్తూరు:
► నగరి రూరల్ మండలం నంబాకం  ఎంపీటీసీ స్థానంలో  63 ఓట్లు మెజారిటీతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గుణ శేఖర్‌రెడ్డి గెలుపు
ఎస్ఆర్‌పురం మండలం వి.వి.పురం ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆదిలక్ష్మి 269 ఓట్లతో విజయం
► గుడుపల్లి మండలం కనమనపల్లి ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వరలక్ష్మి 494 ఓట్లు మెజార్టీతో గెలుపు

10.40AM
కర్నూలు: 
చగలమర్రి -3 ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వెళ్లంపల్లి వెంకటలక్ష్మీ గెలుపు
చకరాజువేముల ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి షాజహాన్ విజయం
మల్లెపల్లి ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వై. మమత గెలుపు
► కృష్ణగిరి మండలం టి. గోకులపాడు ఎంపీటీపీగీ వైస్సార్‌సీపీ అభ్యర్ది రమేశ్వరమ్మ 60 ఓట్ల మెజార్టీతో గెలుపు
► ఆదోని మండలం ధానపురం గ్రామంలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి హనుమయ్య 157 ఓట్లతో విజయం.
► ఆదోని మండలం బైచిగేరి గ్రామంలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి కె.నాగభూషణ్ రెడ్డి 58 ఓట్లతో  విజయం.
► ఆదోని మండలం హనువల్ గ్రామంలో  వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి  సి.ఇరన్న 437 ఓట్లతో గెలుపు.

10.30AM 
తూర్పు గోదావరి జిల్లా
► మారేడుమిల్లి మండలం దొర చింతలపాలెం ఎంపీటీసీగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విజయం.
► సీతానగరం మండలం కాటవరం ఎంపీటీసీ స్థానంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తాడేపల్లి వెంకట్రావు 362 ఓట్ల మెజారిటీతో విజయం

కృష్ణాజిల్లా
పెనుగంచిప్రోలు మండలం కొనకంచి ఎంపీటీసీగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కనగాల శ్రీనివాసరావు 602 ఓట్ల మెజార్టీతో గెలుపు
► నూజివీడు మండలం దేవరగుంట ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి నక్కా శ్రీనివాసరావు గెలుపు
► నాగాయలంక మండలం పర్రచివర ఎంపీటీసీ స్థానంలో 395 ఓట్ల మెజార్టీతో బుడిపల్లి ఆదిశేషు గెలుపు
► ఆగిరిపల్లి మండలం ఈదర-1 ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా దొండపాటి కుమారి 30 ఓట్ల మెజారిటీతో గెలుపు

అనంతపురం
చిలమత్తూరు మండలం కొడికొండ ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఇర్షాద్ బేగం గెలుపు
► పరిగి మండలం శాసనకోట ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నాగజ్యోతి  213  ఓట్ల మెజార్టీతో  విజయం
► కొండాపూర్ ఎంపీటీసీ స్థానంలో వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థి సునంద విజయం
► వానవోలు ఎంపీటీసీ రెండవ స్థానంలో వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థి గాయత్రి బాయి విజయం
► గోరంట్ల-3 ఎంపీటీసీ స్థానంలో వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థి సోమశేఖర్ విజయం
► డి.హీరేహాల్ మండలం చెర్లోపల్లి ఎంపీటీసీ టీడీపీ అభ్యర్థి మొండి మల్లికార్జున 315 ఓట్లతో విజయం.
 మడకశిర మండలం గోవిందాపురం ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తాళ్లికేరమ్మ 82 ఓట్లతో విజయం
► పెనుకొండ మండలం రాంపురం ఎంపీటీసీ టీడీపీ అభ్యర్థి పద్మావతి విజయం.
► ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలం మల్లెపల్లి-1 ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చిలక మస్తాన్ రెడ్డి 409 ఓట్ల మెజార్టీ తో విజయం
► నార్పల మండలం బి. పప్పూరు ఎంపీటీసీగా పద్మాకర్ రెడ్డి 137 మెజారిటీతో  ఘన విజయం
► కనగానపల్లి మండలం కొనాపురం వైస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి జీ. రాజేశ్వరి 369 ఓట్లతో విజయం

10.20AM
నెల్లూరు జిల్లా:
► సైదాపురం మండలం ఆనంతమడుగు ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి లెబాకు వెంకటరమణయ్య 270 ఓట్ల మెజారిటీతో విజయం 
గంగవరం ఎంపీటీసీలో  292 ఓట్ల మెజారిటీతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సుమిత్రమ్మ విజయం

కృష్ణాజిల్లా: 
 ఆగిరిపల్లి (మం) ఈదర -1 ఎంపీటీసీలో దొండపాటి కుమారి(వైఎస్సార్‌సీపీ) 30 ఓట్లతో గెలుపు  
 గన్నవరం (మం) చినఅవుటుపల్లి ఎంపీటీసీలో గంతోటి ప్రశాంతి(వైఎస్సార్‌సీపీ) 470 ఓట్లతో విజయం 
 నూజివీడు (మం) దేవరగుంట ఎంపీటీసీలో నక్కా శ్రీనివాసరావు ( వైఎస్సార్‌సీపీ) 1150 ఓట్లతో గెలుపు 
 నాగాయలంక (మం) పర్రచివర ఎంపీటీసీలో బుడిపల్లి ఆదిశేషు( వైఎస్సార్‌సీపీ) 395 ఓట్లతో గెలుపు 
 ముదినేపల్లి (మం) ముదినేపల్లి ఎంపీటీసీలో మరీదు నాగలింగేశ్వరరావు( వైఎస్సార్‌సీపీ) 523 ఓట్లతో విజయం
 పెనుగంచిప్రోలు (మం) కొనకంచి ఎంపీటీసీలో కనగాల శ్రీనివాసరావు(వైఎస్సార్‌సీపీ) 602 ఓట్లతో గెలుపు 
 ముదినేపల్లి (మం) వణుదుర్రు ఎంపీటీసీలో గుమ్మడి వెంకటేశ్వరరావు( టీడీపీ) 279 ఓట్లతో గెలుపు

10.14AM
పశ్చిమ గోదావరి జిల్లా: 
► భీమడోలు మండలం అంబరుపేట ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దాసరి విజయభాను 10 ఓట్ల మెజార్టీతో గెలుపు
► దెందులూరు1 ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తాళ్లూరి నాగరాజు 80 ఓట్ల మెజారిటీతో గెలుపు
► పెరవలి మండలం కానూరు 2 ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మత్తల ఉషారాణి 256 ఓట్లు మెజార్టీతో గెలుపు
► కుక్కునూరు మండలం మాధవరం ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కుండా సూర్యనారాయణ182 ఓట్ల మెజారిటీతో  గెలుపు
► అత్తిలి మండలంలోని పాలూరు ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి  శరఖడం రామలింగ విష్ణు మూర్తి 257 ఓట్ల మెజారిటీతో గెలుపు
► చాగల్లు ఎంపీటీసీ  5 స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మట్ల విజయకుమారి 969 ఓట్ల మెజార్టీతో గెలుపు
► జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం ఎంపీటీసీ- 2లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దల్లి వెంకట మోహన్ రెడ్డి 428 ఓట్ల మెజార్టీతో  గెలుపు.
► నిడదవోలు మండలంలోని తాళ్లపాలెం ఎంపీటీసీలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బి.కృష్ణబాబు 40 ఓట్ల  మెజారిటీతో గెలుపు

10.05AM
►  వైఎస్సార్ జిల్లా
 ప్రొద్దుటూరు మండలం నంగానూరుపల్లి ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ చెందిన కృష్ట పాటి సంధ్య  విజయం
► ముద్దనూరు మండలం కొర్రపాడు వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి పుష్పలత 420 ఓట్ల మెజార్టీతో గెలుపు
 జమ్మలమడుగు జడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని అశ్విని 650 ఓట్ల మెజార్టీతో గెలుపు


కృష్ణాజిల్లా : గన్నవరం మండలం చిన్నఅవుటపల్లి ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ కైవసం 
వైఎస్సార్ సీపీ అభ్యర్థి గంతోటి ప్రశాంతి 470 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

09.20AM
► కృష్ణా జిల్లా: విస్సన్నపేట జడ్పీటీసీ పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ఫలితాలు
మొత్తం పోలైన ఓట్లు-32
వైఎస్సార్‌సీపీ-14
బీఎస్సీ -6
బీజేపీ-1
టీడీపీ-0
కాంగ్రెస్‌-0
సీపీఎం-3
చెల్లని ఓట్లు -8

08.30AM
► పశ్చిమ గోదావరి జిల్లా: చాగల్లు ఎంపీటీసీ స్థానానికి  కౌంటింగ్ కొనసాగుతోంది. రెండు టేబుళ్ల ద్వారా కౌంటింగ్ అధికారులు నిర్వహిస్తున్నారు. 
► నెల్లూరుజిల్లా: బాలాయపల్లి మండల పరిషత్ కార్యాలయంలో వెంగమాంబాపురం ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది.
కోవూరు నియోజకవర్గం గంగవరం ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్  కొనసాగుతోంది. కోడూరు మండల పరిషత్ కార్యాలయం కౌంటింగ్ సెంటర్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమలు చేశారు.
కోట బిట్ 2 ఎంపీటీసీ ఎన్నికల కౌటింగ్‌ కోట మండల పరిషత్ కార్యాలయంలో కొనసాగుతోంది.

08.00AM

రాష్ట్రంలోని 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది.
పెనడ, విస్పన్న పేట, జి. కొడూరు జడ్పీటీసీ స్థానాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.
విజయనగరం: జిల్లాలోని 9 ఎంపీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కిపు ప్రారంభమైంది.
శ్రీకాకుళం: జిల్లాలోని ఒక జడ్పీటీసీ, 15 ఎంపీటీసీ స్థానాలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు
కర్నూల్ జిల్లా: వెల్దుర్తి మండలం మల్లెపల్లి ఎంపీటీసీ స్థానానికి ప్రారంభమైన కౌంటింగ్. కృష్ణగిరి మండలం టి. గోకులపాడు ఎంపీటీసీ స్థానానికి ప్రారంభమైన కౌంటింగ్.

07.57AM
మరికాసేపట్లో ప్రారంభం కానున్న రాష్ట్రంలోని 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ.

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మంగళవారం ఎన్నికలు జరిగిన పది జెడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాల ఓట్లను గురువారం లెక్కించనున్నారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయం తెలిపింది. ఎంపీటీసీ స్థానాల్లో ఫలితాలు ఉదయం పది గంటలకు తేలతాయని, జెడ్పీటీసీ స్థానాల్లో మధ్యాహ్నం 12 గంటలకల్లా తుది ఫలితం వెల్లడించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.   

ఆ 757 ఓట్లతో తేలనున్న జమ్మలమడుగు జెడ్పీటీసీ ఫలితం 
వీటితోపాటు సెప్టెంబరు 19న రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల సమయంలో కేవలం రెండు పోలింగ్‌ బూత్‌లలో ఓట్ల లెక్కింపునకు వీలులేని పరిస్థితిలో ఫలితం ప్రకటన వాయిదాపడిన వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు జెడ్పీటీసీ స్థానం విజేత ఎవరో కూడా గురువారం తేలనుంది. అప్పట్లో ఈ జెడ్పీటీసీ స్థానంలో లెక్కింపు జరిగినంతవరకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి.. ఆ తర్వాత స్థానంలో ఉన్న బీజేపీ అభ్యర్థి కంటే 517 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. ఆ జెడ్పీటీసీ స్థానం పరిధిలోని గొరిగనూరు ఎంపీటీసీ స్థానంలో మొత్తం 827 మంది ఓటర్లున్న రెండు పోలింగ్‌ కేంద్రాల్లో పోలైన ఓట్లు తడిసి లెక్కింపునకు వీలుగా లేవని అప్పట్లో కౌంటింగ్‌ సిబ్బంది తేల్చారు.

మొదటి రెండు స్థానాల్లో ఉన్న అభ్యర్థుల మధ్య ఓట్ల తేడా 517గా ఉండడం, లెక్కించకుండా మిగిలిపోయిన ఓట్లు అంతకంటే ఎక్కువ ఉండడంతో అప్పట్లో ఆ ఎన్నికల ఫలితాన్ని ప్రకటించకుండా వాయిదా వేశారు. తాజాగా ఆ రెండు పోలింగ్‌ బూత్‌లలో మంగళవారం పోలింగ్‌ నిర్వహించగా 757 ఓట్లు పోలయ్యాయి. ఈ 757 ఓట్లే ఇప్పుడు ఆ జెడ్పీటీసీ విజేతను నిర్ణయించనున్నాయి. అప్పట్లో ఓట్లు తడిసిన కారణంగా ఆరు ఎంపీటీసీ స్థానాల ఫలితాల ప్రకటనను వాయిదావేశారు. రీ పోలింగ్‌ నిర్వహించడంతో ఆ ఆరు ఎంపీటీసీ స్థానాల ఫలితాలు కూడా గురువారం తేలనున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement