AP MPTC, ZPTC Election Results: పరిషత్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం | MPTC ZPTC election Counting of votes and results 19th September | Sakshi
Sakshi News home page

పరిషత్‌ ఎన్నికల కౌంటింగ్‌: లైవ్‌ అప్‌డేట్స్‌

Published Sun, Sep 19 2021 2:41 AM | Last Updated on Mon, Sep 20 2021 5:21 AM

MPTC ZPTC election Counting of votes and results 19th September - Sakshi

లైవ్‌ అప్‌డేట్స్‌..
 

రాష్ట్రవ్యాప్తంగా 637 జెడ్పీటీసీ స్థానాల ఫలితాలు వెల్లడి కాగా వాటిలో 627 జెడ్పీటీసీ స్థానాలు వైఎస్సార్‌సీపీ సొంతం చేసుకుని తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శించింది.
ఇక ఎంపీటీసీ స్థానాల విషయానికి వస్తే ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ ఏకంగా 8,075 ఎంపీటీసీ స్థానాలు గెలుచుకుని విజయ ఢంకా మోగించింది.

ఇప్పటివరకు వెల్లడైన ఎంపీటీసీ స్థానాల ఫలితాలు ఇలా ఉన్నాయి.
కృష్ణా:
648 ఎంపీటీసీ స్థానాల్లో 568 చోట్ల వైఎస్సార్‌సీపీ గెలుపు.
ప్రకాశం: 784 ఎంపీటీ\సీ స్థానాల్లో 668 చోట్ల వైఎస్సార్‌సీపీ విజయకేతనం
నెల్లూరు: 562 ఎంపీటీసీ స్థానాల్లో 400 వైఎస్సార్‌సీపీ 312 సొంతం చేసుకుని తిరుగులేని విజయం సొంతం చేసుకుంది.
తూర్పు గోదావరి: 998 స్థానాల్లో 538 సొంతం చేసుకున్న వైఎస్సార్‌సీపీ.
పశ్చిమ గోదావరి: 781 స్థానాల్లో 577 వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది.
విశాఖపట్టణం: 612 ఎంపీటీసీ స్థానాలకు వైఎస్సార్‌సీపీ 450 గెలుచుకుంది.
విజయనగరం: 549 ఎంపీటీసీ స్థానాల్లో 433 వైఎస్సార్‌సీపీ కైవసం
శ్రీకాకుళం: 668 ఎంపీటీసీ స్థానాల్లో 562 వైఎస్సార్‌సీపీ గెలుపు.
వైఎస్సార్‌ కడప: 549 స్థానాల్లో 433 వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. 
అనంతపురం: 841 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్ సీపీ 763 సొంతం చేసుకుంది.
చిత్తూరు: 886 ఎంపీటీసీ స్థానాల్లో 822 సొంత చేసుకుని వైఎస్సార్‌సీపీ తిరుగులేని ఆధిక్యత ప్రదర్శించింది. 
కర్నూలు: 807 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ 718 గెలుపొందింది. 

రాష్ట్రవ్యాప్తంగా 412 జెడ్పీటీసీ స్థానాల ఫలితాలు వెల్లడి కాగా వాటిలో 404 జెడ్పీటీసీ స్థానాలు వైఎస్సార్‌సీపీ సొంతం చేసుకుని తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శించింది.
ఇక ఎంపీటీసీ స్థానాల విషయానికి వస్తే ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ ఏకంగా 5,462 ఎంపీటీసీ స్థానాలు గెలుచుకుని విజయ ఢంకా మోగించింది.

పశ్చిమ గోదావరి
జిల్లా పరిషత్‌ పీఠం కూడా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సొంతం చేసుకుంది. 48 స్థానాల్లో ఇప్పటికే 35 స్థానాల్లో విజయం సాధించింది. మరికొన్ని స్థానాల ఫలితాలు రావాల్సి ఉంది.

ఎంపీటీసీ
ఇప్పటివరకు 6,242 ఎంపీటీసీ స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. వీటిలో అత్యధికంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 5,273 స్థానాలు కైవసం చేసుకుని విజయకేతనం ఎగురవేసింది. 

జెడ్పీటీసీ
ఇక జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి 354 స్థానాల ఫలితాలు ప్రకటించారు. వీటిలో 348 జెడ్పీటీసీలను సొంతం చేసుకున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అన్ని జిల్లాల జెడ్పీ పీఠాలను కైవసం చేసుకుంది. నాలుగు టీడీపీకి, రాగా ఒకటి సీపీఐ, స్వతంత్రుడు మరొకరు గెలిచారు.


కోనసీమలోనూ వైఎస్సార్‌సీపీ జెండా రెపరెపలాడుతోంది. వెలువడుతున్న ఎన్నికల ఫలితాలన్నీ వైఎస్సార్‌సీపీ ఖాతాలోనే పడుతున్నాయి. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధిక జెడ్పీటీసీ స్థానాలను సొంతం చేసుకుంటోంది.


విజయనగరం: నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల సరసన విజయనగరం చేరింది. విజయనగరంలోనూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఉన్న 34 జెడ్పీటీసీ స్థానాల్లో  ఆ పార్టీ విజయం సాధించింది.

వైఎస్సార్‌ కడప జిల్లా: కడప జిల్లాలో 50 జెడ్పీటీసీ స్థానాలకు 46 వైఎస్సార్‌ సీపీ సొంతం చేసుకుంది.

ప్రకాశం జిల్లా: ప్రకాశంలోనూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. జిల్లాలోని 56 జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. 

చిత్తూరు జిల్లా: జెడ్పీ ఎన్నికలతో పాటు మండల పరిషత్‌ ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీ భారీ ఆధిక్యత ప్రదర్శించింది. చిత్తూరు జిల్లాలో 886 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ 822 సొంతం చేసుకుని విజయదుంధుబి మోగించింది. కాగా టీడీపీ కేవలం 25 స్థానాల్లో గెలిచింది. ఈ విజయంతో వైఎస్సార్‌సీపీ 65 మండల పరిషత్‌లను సొంతం చేసుకుంది.

నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో వైఎస్సార్‌సీపీ క్లీన్‌ స్వీప్‌. ఆయా జిల్లాల్లోని ఉన్న జెడ్పీటీసీ స్థానాలన్నింటిని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సొంతం చేసుకుంది.


కృష్ణా జిల్లా: 46 జెడ్పీటీసీ స్థానాల్లో 23 వైఎస్సార్‌సీపీ సొంతం.
గుంటూరు: 54 జెడ్పీటీసీ స్థానాల్లో 27 వైఎస్సార్‌సీపీ విజయం
ప్రకాశం: 56 స్థానాల్లో 56 సొంతం చేసుకున్న వైఎస్సార్‌సీపీ
నెల్లూరు: జిల్లాలో వైఎస్సార్‌సీపీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఉన్న 46 స్థానాలను వైఎస్సార్‌సీపీ సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది.
విశాఖపట్టణం: 39 స్థానాల్లో 30 వైఎస్సార్‌సీపీ గెలుపు
విజయనగరం: 34 జెడ్పీటీసీ స్థానాల్లో 25 వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది.
శ్రీకాకుళం: 38 జెడ్పీటీసీ స్థానాల్లో 20 వైఎస్సార్‌సీపీ కైవసం
అనంతపురం: 63 స్థానాల్లో 35 సొంతం చేసుకున్న వైఎస్సార్‌సీపీ
చిత్తూరు: 63 జెడ్పీటీసీ స్థానాల్లో 63 వైఎస్సార్‌సీపీ విజయం
వైఎస్సార్‌ కడప: 50 స్థానాల్లో 44 గెలిచిన వైఎస్సార్‌సీపీ
కర్నూలు: జెడ్పీటీసీ ఎన్నికల్లో ఉన్న 53లో 51 స్థానాలను వైఎస్సార్‌సీపీ సొంతం చేసుకుంది.
తూర్పు గోదావరి: 61 జెడ్పీటీసీలకు 5 చోట్ల వైఎస్సార్‌సీపీ గెలిచింది.
పశ్చిమ గోదావరి: 48 జెడ్పీటీసీ స్థానాల్లో 32 వైఎస్సార్‌సీపీ కైవసం.

  • జిల్లా పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు 186 జెడ్పీటీసీ ఫలితాలు రాగా 184లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది.

జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయదుంధుబి. రాష్ట్రంలోని 13 జిల్లా పరిషత్‌లలో 11 జెడ్పీలు కైవసం చేసుకుంది.

144 జెడ్పీటీసీ స్థానాల్లో 142 వైఎస్సార్‌సీపీ సొంతం

విజయనగరం జిల్లా:
శృంగవరపుకోట నియోజకవర్గం లక్కవరపుపేట జెడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ విజయం



అనంతపురం జిల్లా
ధర్మవరం నియోజకవర్గం:
ముదిగుబ్బ జెడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ విజయం
గుంతకల్లు నియోజకవర్గం: గుత్తిలో జెడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ కైవసం
గుంతకల్లు నియోజకవర్గం: గుంతకల్లు జెడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ విజయం

కృష్ణాజిల్లా: పెడన నియోజకవర్గం కృత్తివెన్ను జెడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ విజయం.

పశ్చిమ గోదావరి: ఉంగుటూరు నియోజకవర్గం గణపవరం జెడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ విజయం



శ్రీకాకుళం: చీపురుపల్లి నియోజకవర్గం గుర్ల జెడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ విజయం
శ్రీకాకుళం: పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం జెడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ కైవసం

ప్రకాశం: కందుకూరు గుడ్లూరు జెడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ విజయం



అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం
బుక్కపట్నం జెడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ గెలుపు
ఆమడగూరు జెడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ కైవసం
ఓబులదేవచెరువు వైఎస్సార్‌సీపీ విజయం
కొత్తచెరువు జెడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ కైవసం
నల్లమాడ జెడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ విజయం
బుక్కపట్నం వైఎస్సార్‌సీపీ సొంతం

అనంతపురం: దర్శి నియోజకవర్గం కురిచేడు వైఎస్సార్సీపీ విజయం.

చిత్తూరు: జీడీ నెల్లూరు నియోజకవర్గం ఎస్సార్‌ పురం జెడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ కైవసం. 13,335 ఓట్ల మెజార్టీతో రమణ ప్రసాద్‌ రెడ్డి విజయం.



వైఎస్సార్‌ కడప: రాజంపేట నియోజకవర్గం నందలూరు జెడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ వశం.

కర్నూలు: శ్రీశైలం నియోజకవర్గం మహానంది జెడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ సొంతం. 

విశాఖపట్టణం: అనకాపల్లి నియోజకవర్గం అనకాపల్లి జెడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ కైవసం.

విశాఖపట్టణం: పాడేరు నియోజకవర్గం పాడేరు జెడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ విజయం.

అనంతపురం: పెనుగొండ నియోజకవర్గం పెనుగొండ జడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. 8,856 ఓట్ల మెజార్టీతో శ్రీరాములు గెలుపొందారు. 
పెనుగొండ నియోజకవర్గం సోమందేవపల్లి జడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. 4,348 ఓట్ల మెజార్టీతో డీసీ అశోక్‌ గెలుపు పొందారు.

ఇప్పటివరకు 3129 ఎంపీటీసీ ఫలితాలు
వైఎస్సార్‌సీపీ-2773, టీడీపీ-267, బీజేపీ-7

విశాఖపట్నం: యలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి జడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. 16,097 ఓట్ల మెజార్టీతో ధూళి నాగరాజు గెలుపొందారు.

విశాఖ: అరకు నియెజకవర్గం పెదబయలు జడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. 500 ఓట్ల మెజార్టీతో బొంజుబాబు గెలుపొందారు.

ప్రకాశం: యర్రగొండపాలెం నియోజకవర్గం యర్రగొండపాలెం జడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. 12,906 ఓట్ల మెజార్టీతో విజయభాస్కర్‌ గెలుపొందారు.

చిత్తూరు జిల్లా: మదనపల్లి నియోజకవర్గం నిమ్మనపల్లి జడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. 5,464 ఓట్ల మెజార్టీతో ప్రమీలమ్మ గెలుపొందారు. మదనపల్లి నియోజకవర్గం రామ సముద్రం జడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. 9, 875 ఓట్ల మెజార్టీతో సీహెచ్‌ రామచంద్రారెడ్డి గెలుపొందారు.

విజయనగరం: గజపతినగరం జడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. 17,971 ఓట్ల మెజార్టీతో గార తవుడు గెలుపొందారు.

అనంతపురంలో రెచ్చిపోయిన టీడీపీ నేతలు
అనంతపురం: జిల్లాలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. ఆత్మకూరు మండలం ముట్టాల ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విజయం సాధించారు.  65 ఓట్లతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పుణ్యశ్రీ విజయం సాధించారు. దాంతో టీడీపీ నేతలు వాదనకు దిగారు. 

ఎన్టీఆర్‌ స్వగ్రామం నిమ్మకూరులో వైఎస్సార్‌సీపీ విజయం
పామర్రు మండలం నిమ్మకూరు ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. నిమ్మకూరును నారా లోకేష్‌ దత్తత తీసుకోగా, ఆయనను ప్రజలు విశ్వసించలేదు. చరిత్రలో తొలిసారి పామర్రు ఎంపీపీని వైఎస్సార్‌సీపీ దక్కించుకుంది.

వైఎస్సార్‌సీపీ ప్రభంజనం 
చిత్తూరు: పరిషత్‌ ఎన్నికల్లో  వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టించింది. జీడీ నెల్లూరు నియోజకవర్గం ఎస్‌ఆర్‌పురం జడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. 13,335 ఓట్ల మెజార్టీతో రమణ ప్రసాద్‌రెడ్డి గెలుపొందారు. జీడీ నెల్లూరు నియోజకవర్గం పాల సముద్రం జడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. 6,758 ఓట్ల మెజార్టీతో అన్బలగన్‌ గెలుపొందారు.

చంద్రబాబుకు షాక్‌..
పరిషత్‌ ఎన్నికల్లో నారావారిపల్లిలో చంద్రబాబుకు షాక్‌ తగిలింది. నారావారిపల్లి ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి గంగాధరం పరాజయం పొందారు. 1,347 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రాజయ్య గెలుపొందారు. టీడీపీకి అభ్యర్థికి కేవలం 307 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.

ఇప్పటివరకు 1562 ఎంపీటీసీ ఫలితాలు వెలువడ్డాయి. వైఎస్సార్‌సీపీ 1399, టీడీపీ 120, బీజేపీ 7.
వైఎస్సార్‌జిల్లా పరిషత్‌ వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. 50కిగాను ఇప్పటివరకు 40 స్థానాలను వైఎస్సార్‌సీపీ గెలుచుకుంది.

ప్రకాశం: త్రిపురాంతకం జడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. 10,930 ఓట్ల మెజార్టీతో మాకం జాన్‌పాల్‌ గెలుపొందారు.
ప్రకాశం: కొనకనమిట్ల జడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ కైవసం. 16,681 ఓట్ల మెజార్టీతో అక్కి దాసరి ఏడుకొండలు గెలుపు
ప్రకాశం: గుడ్లూరు జడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ కైవసం. 11,464 ఓట్ల మెజార్టీతో కొరిసిపాటి బాపిరెడ్డి గెలుపు
ప్రకాశం: కురిచేడు జడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ కైవసం. 5,930 ఓట్ల మెజార్టీతో వెంకట నాగిరెడ్డి గెలుపు

పరిషత్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ హవా కొనసాగుతోంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాల్లో ఫ్యాన్‌ దూసుకుపోతోంది. అనేక చోట్ల సింగిల్‌ డిజిట్‌కే టీడీపీ పరిమితమైంది.
వైఎస్సార్‌ జిల్లా: నందలూరు జడ్పీటీసీ వైఎస్సార్‌ కైవసం చేసుకుంది. 20,849 ఓట్ల మెజార్టీతో గడికోట ఉషారాణి విజయం సాధించారు.

కర్నూలు జిల్లాలో ఇప్పటివరకు 202 ఎంపీటీసీ ఫలితాలు..
మిగిలిన 282 ఎంపీటీసీ స్థానాలకు కొనసాగుతున్న కౌంటింగ్‌
వైఎస్సార్‌సీపీ-184, టీడీపీ-15 బీజేపీ-1, ఇతరులు-2

వైఎస్సార్‌ జిల్లాలో ఇప్పటివరకు 20 ఎంపీటీసీ ఫలితాలు

దేవినేని ఉమా ఇలాకాలో వైఎస్సార్‌సీపీ హవా
స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. విజయవాడ: దేవినేని ఉమా ఇలాకాలో వైఎస్సార్‌సీపీ హవా ప్రదర్శించింది. గొల్లపూడిలో 10 ఎంపీటీసీలకు 10 వైఎస్సార్‌సీ కైవసం చేసుకుంది.

వైఎస్సార్‌ జిల్లా: రాజుపాలెం మండలంలో వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్‌. 9 ఎంపీటీసీ స్థానాలకు 9 వైఎస్సార్‌సీపీ కైవసం.
విజయనగరం: మెరముడిదం మండలంలో వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్‌. 16 ఎంపీటీసీలకు 16 వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది.
అనంతపురం: తాడిమర్రి మండలంలో వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్‌. 9 ఎంపీటీసీ స్థానాలకు 9 వైఎస్సార్‌సీపీ కైవసం.
చిత్తూరు: నిమ్మనపల్లి మండలంలో వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్‌. 9 ఎంపీటీసీ స్థానాలకు 9 వైఎస్సార్‌సీపీ కైవసం
ప్రకాశం: మర్రిపూడి మండలంలో వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్‌. 11 ఎంపీటీసీ స్థానాలకు 11 వైఎస్సార్‌సీపీ కైవసం

ప్రకాశం: మార్కాపురం జడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. 15,315 మెజార్టీతో వైఎస్సార్‌సీ అభ్యర్థి బాపన్నరెడ్డి విజయం సాధించారు.
విశాఖపట్నం: 45 ఓట్ల మెజార్టీతో జీకే వీధి ఎంపీటీసీ(వైఎస్సార్‌సీపీ) గెలుపు
ప్రకాశం: తుర్లుపాడు జడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. 10,335 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వెన్న ఇందిర గెలుపు పొందారు.
ప్రకాశం: జిల్లాలో రెండు జడ్పీటీసీలు వైఎస్సార్‌సీపీ కైవసం
చిత్తూరు: ఎస్‌ఆర్‌పురం జడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. 13,335 ఓట్ల మెజార్టీతో రమణ ప్రసాద్‌రెడ్డి గెలుపొందారు.
కర్నూలు: మహానంది జడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ కైవసం. 13,288 ఓట్ల మెజార్టీతో కేవీఆర్‌ మహేశ్వర్‌రెడ్డి గెలుపు

పరిషత్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ హవా
చిత్తూరు: పరిషత్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ హవా కొనసాగుతోంది. 1573 ఓట్ల మెజార్టీతో బుగ్గపట్నం ఎంపీటీసీ(వైఎస్సార్‌సీపీ) గెలుపు పొందారు. 1073 ఓట్ల మెజార్టీతో టీ.సదుం ఎంపీటీసీ(వైఎస్సార్‌సీపీ) గెలుపొందారు.

ప్రశాంతంగా ఎన్నికల కౌంటింగ్‌
పరిషత్‌ ఎన్నికల కౌంటింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. రాత్రి లోపు పూర్తిస్థాయి ఫలితాలు ప్రకటిస్తామన్నారు. ఐదారు చోట్ల బ్యాలెట్‌ బాక్సుల్లో నీళ్లు చేరాయని తెలిపారు. బ్యాలెట్‌ బాక్సులు పూర్తిగా తెరిచాక స్పష్టత వస్తుందని ఆయన తెలిపారు.

విజయనగరం: 44 ఓట్ల మెజార్టీతో గంజాయి భద్ర ఎంపీటీసీ(వైఎస్సార్‌సీపీ) గెలుపు
అనంతపురం: 1331 ఓట్ల మెజార్టీతో వెన్న పూసపల్లి ఎంపీపీటీ(వైఎస్సార్‌సీపీ)  గెలుపు

కృష్ణా జిల్లా: 180 ఓట్ల మెజార్టీతో పాములంక ఎంపీటీసీ(వైఎస్సార్‌సీపీ) గెలుపు
కృష్ణా: 585 ఓట్ల మెజార్టీతో ఆటపాక ఎంపీటీసీ(వైఎస్సార్‌సీపీ) గెలుపు
విజయనగరం: 1629 ఓట్ల మెజార్టీతో ఉత్తరవల్లి ఎంపీటీసీ( వైఎస్సార్‌సీపీ) గెలుపు)
ప్రకాశం: 1645 ఓట్ల మెజార్టీతో సంతమాగులూరుఏ-1 ఎంపీటీసీ(వైఎస్సార్‌సీపీ) గెలుపు
ప్రకాశం: 434 ఓట్ల మెజార్టీతో ఊళ్లపాలెం ఎంపీటీసీ(వైఎస్సార్‌సీపీ) గెలుపు

మాచర్ల నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్‌
గుంటూరు:
మాచర్ల నియెజకవర్గంలో వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్‌ చేసింది. ఐదు జీడ్పీటీసీ స్థానాలకు ఐదూ వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. 71 ఎంపీటీసీ స్థానాలకు 71 వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది.

బాబు ఇలాకాలో ఫ్యాన్‌ గాలి..
చిత్తూరు జిల్లా: 
చంద్రబాబు ఇలాకాలో ఫ్యాన్‌ గాలి వీచింది. కుప్పం మండలం టీ సద్దుమూరు ఎంపీటీసీ స్థానం  వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. టీడీపీ అభ్యర్థిపై వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అశ్విని 1073 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది.

విజయనగరం: పరిషత్‌ ఎన్నికలల్లో వైఎస్సార్‌సీపీ హవా కొనసాగుతోంది. సీతానగరం మండలంలో 17 ఎంపీటీసీ స్థానాలకు ఆరు ఏకగ్రీవం కాగా, మిగిలిన 11 ఎంపీటీసీ స్థానాల్లో 5 చోట్ల వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది.
పశ్చిమగోదావరి: 613 ఓట్ల మెజార్టీతో  శ్రీరామపురం ఎంపీటీసీ(వైఎస్సార్‌సీపీ) గెలుపు 
వైఎస్సార్‌ జిల్లా: 490 ఓట్ల మెజార్టీతో ఎస్‌.కొత్తపల్లి ఎంపీటీసీ(వైఎస్సార్‌సీపీ గెలుపు
వైఎస్సార్‌ జిల్లా: 1682 ఓట్ల మెజార్టీతో పెద్దకారంపల్లి ఎంపీటీసీ (వైఎస్సార్‌సీపీ) గెలుపు
వైఎస్సార్‌ జిల్లా: 490 ఓట్ల మెజార్టీతో ఎస్‌.కొత్తపల్లి ఎంపీటీసీ(వైఎస్సార్‌సీపీ గెలుపు
వైఎస్సార్‌ జిల్లా: 1682 ఓట్ల మెజార్టీతో పెద్దకారంపలల్లి ఎంపీటీసీ (వైఎస్సార్‌సీపీ) గెలుపు
కృష్ణా: 372 ఓట్ల మెజార్టీతో అక్కపాలెం ఎంపీటీసీ (వైఎస్సార్‌సీపీ) గెలుపు
చిత్తూరు: 616 ఓట్ల మెజార్టీతో పాత వెంకటాపురం ఎంపీటీసీ(వైఎస్సార్‌సీపీ) గెలుపు
వైఎస్సార్‌ జిల్లా: 883 ఓట్ల మెజార్టీతో ఊటుకురు-2 ఎంపీటీసీ(వైఎస్సార్‌సీపీ) గెలుపు
అనంతపురం: 882 ఓట్ల మెజార్టీతో దంచర్ల ఎంపీటీసీ( వైఎస్సార్‌సీపీ) గెలుపు
అనంతపురం: 729 ఓట్ల మెజార్టీతో అమ్మలదిన్నె ఎంపీటీసీ(వైఎస్సార్‌సీపీ) గెలుపు
చిత్తూరు: 1573 ఓట్ల మెజార్టీతో బుగ్గపట్నం ఎంపీటీసీ(వైఎస్సార్‌సీపీ) గెలుపు
అనంతపురం: రామగిరి జడ్పీటీసీ పోస్టల్‌ బ్యాలెట్‌లో వైఎస్సార్‌సీపీ ఆధిక్యం
వైఎస్సార్‌ జిల్లా: జమ్మలమడుగు జడ్పీటీసీ పోస్టల్‌ బ్యాలెట్‌లో వైఎస్సార్‌సీపీ ఆధిక్యం
వైఎస్సార్‌ జిల్లా: బంటుపల్లి జడ్పీటీసీ పోస్టల్‌ బ్యాలెట్‌లో వైఎస్సార్‌సీపీ ఆధిక్యం
పశ్చిమగోదావరి: జీలుగుమిల్లి జడ్పీటీసీ పోస్టల్‌ బ్యాలెట్‌లో వైఎస్సార్‌సీపీ ఆధిక్యం
కృష్ణా: పెడన జడ్పీటీసీ పోస్టల్‌బ్యాలెట్‌లో వైఎస్సార్‌సీపీ ఆధిక్యం
పోస్టల్‌ బ్యాలెట్‌లో వైఎస్సార్‌సీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది.
నెల్లూరు: 766 ఓట్ల మెజార్టీతో ఆమంచర్ల ఎంపీటీసీ(వైఎస్సార్‌సీపీ) గెలుపు
పశ్చిమగోదావరి: వేలేరుపాడు జడ్పీటీసీ పోస్టల్‌ బ్యాలెట్‌లో వైఎస్సార్‌సీపీ ఆధిక్యం

నెల్లూరు: కలిగిరి జడ్పీటీసీ పోస్టల్‌ బ్యాలెట్‌లో వైఎస్సార్‌సీపీ ఆధిక్యం
వైఎస్సార్‌ జిల్లా: జమ్మలమడుగు జడ్పీటీసీ పోస్టల్‌ బ్యాలెట్‌లో వైఎస్సార్‌సీపీ ఆధిక్యం

అనంతపురం: కనగాపల్లి జడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మారుతి ప్రసాద్‌ ఆధిక్యం
ఉరవకొండ జడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పార్వతమ్మ ఆధిక్యం
తనకల్లు జడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి జక్కల జ్యోతి ఆధిక్యం
పెద్దవడుగూరు జడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి భాస్కర్‌రెడ్డి ముందంజ
కంబదూరు జడ్పీటీసీ పోస్టల్‌ బ్యాలెట్‌లో వైఎస్సార్‌సీపీ ఆధిక్యం

వైఎస్సార్‌ జిల్లా: కమలాపురం మండలం దేవరాజుపల్లి దేవరాజుపల్లి ఎంపీటీసీ (వైఎస్సార్‌సీపీ) గెలుపొందారు. 186 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చెన్నకేశవరెడ్డి విజయం సాధించారు.

విజయనగరం: జిల్లా వ్యాప్తంగా పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 31 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. 31 జడ్పీటీసీ, 487 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్ జరుగుతోంది. కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి ఆన్‌లైన్‌ ద్వారా ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను  జిల్లా కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం డివిజన్‌ పరిధిలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతుంది. పోస్టల్‌ బ్యాలెట్‌లో వైఎస్సార్‌సీపీ ఆధిక్యంలో ఉంది.
ఆంధ్రప్రదేశ్‌ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ కౌంటింగ్‌ నిర్వహిస్తున్నారు. 515 జడ్పీటీసీ, 7216 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్‌ జరుగుతోంది.

► 7,219 ఎంపీటీసీ.. 515 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసిన వారి భవితవ్యం తేలబోతోంది. హైకోర్టు తీర్పు కారణంగా ఐదున్నర నెలలుగా ప్రజా తీర్పు స్ట్రాంగ్‌ రూంలకే పరిమితం అయిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌ 8వ తేదీన ఆయా స్థానాలకు జరిగిన పోలింగ్‌లో మొత్తం 1,29,55,980 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో పూర్తి స్థాయిలో కోవిడ్‌ నింబంధనలు పాటించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని ఇప్పటికే జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్‌ సిబ్బందితో పాటు అభ్యర్థుల తరుఫున హాజరయ్యే ఏజెంట్లు కరోనా వ్యాక్సినేషన్‌ వేయించుకొని ఉండాలనే ఆదేశాలు వెళ్లాయి. ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి మండలాల వారీగా ఒక్కో స్థానానికి ఒకటి చొప్పున 7,219 టేబుళ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 515 జెడ్పీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు కోసం వేరుగా 4,008 టేబుళ్లను సిద్ధం చేశారు. 

జిల్లాల వారీగా..
శ్రీకాకుళం:  37 జడ్పీటీసీ, 590 ఎంపీటీసీ  స్థానాలకు కౌంటింగ్‌
విజయనగరం: 31 జడ్పీటీసీ,  487 ఎంపీటీసీ  స్థానాలకు కౌంటింగ్‌
విశాఖపట్నం: 37 జడ్పీటీసీ,   612 ఎంపీటీసీ  స్థానాలకు కౌంటింగ్‌
తూర్పు గోదావరి: 61 జడ్పీటీసీ, 996 ఎంపీటీసీ  స్థానాలకు కౌంటింగ్‌
పశ్చిమ గోదావరి: 45 జడ్పీటీసీ, 781 ఎంపీటీసీ  స్థానాలకు కౌంటింగ్‌
కృష్ణా: 41 జడ్పీటీసీ, 648  ఎంపీటీసీ  స్థానాలకు కౌంటింగ్‌
గుంటూరు : 45 జడ్పీటీసీ,  571 ఎంపీటీసీ  స్థానాలకు కౌంటింగ్‌
ప్రకాశం: 41 జడ్పీటీసీ, 368 ఎంపీటీసీ  స్థానాలకుకౌంటింగ్‌
నెల్లూరు: 34 జడ్పీటీసీ, 362 ఎంపీటీసీ  స్థానాలకుకౌంటింగ్‌
చిత్తూరు: 33 జడ్పీటీసీ, 419 ఎంపీటీసీ  స్థానాలకు కౌంటింగ్‌
వైఎస్సార్‌: 12 జడ్పీటీసీ, 117 ఎంపీటీసీ  స్థానాలకు కౌంటింగ్‌
కర్నూలు: 36 జడ్పీటీసీ,  484 ఎంపీటీసీ  స్థానాలకు కౌంటింగ్‌
అనంతపురం: 62 జడ్పీటీసీ, 781  ఎంపీటీసీ  స్థానాలకు కౌంటింగ్‌

సాక్షి, అమరావతి: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు ఎట్టకేలకు ఆదివారం వెల్లడి కాబోతున్నాయి. 7,219 ఎంపీటీసీ.. 515 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసిన ఏడాదిన్నర తర్వాత నేడు వారి భవితవ్యం తేలబోతోంది. ఏప్రిల్‌ 8వ తేదీన ఆయా స్థానాలకు జరిగిన పోలింగ్‌లో మొత్తం 1,29,55,980 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైకోర్టు తీర్పు కారణంగా ఐదున్నర నెలలుగా ప్రజా తీర్పు స్ట్రాంగ్‌ రూంలకే పరిమితం అయిన విషయం తెలిసిందే. చదవండి: ఆ 23 మంది గెలిస్తే అక్కడ మళ్లీ ఎన్నికలే

మూడు రోజుల క్రితమే హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఓట్ల లెక్కింపునకు అనుమతించడంతో రాష్ట్ర వ్యాప్తంగా 206 కేంద్రాల్లోని 209 ప్రదేశాలలో ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఒక్కో కౌంటింగ్‌ కేంద్రంలో మండలాల వారీగా వేర్వేరుగా ఓట్ల లెక్కింపు కోసం వేర్వేరు హాళ్లను సిద్ధం చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు జిల్లాల్లో చేపట్టిన ఏర్పాట్లపై సమీక్షించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని శనివారం ఉదయం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రిటర్నింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులతో కలిసి ఓట్ల లెక్కింపు ప్రక్రియలో మొత్తం 44,155 మంది సిబ్బంది పని చేయనున్నారు. 


పూర్తి స్థాయిలో ఏర్పాట్లు
► ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో పూర్తి స్థాయిలో కోవిడ్‌ నింబంధనలు పాటించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని ఇప్పటికే జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్‌ సిబ్బందితో పాటు అభ్యర్థుల తరుఫున హాజరయ్యే ఏజెంట్లు కరోనా వ్యాక్సినేషన్‌ వేయించుకొని ఉండాలనే ఆదేశాలు వెళ్లాయి. 
► ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి మండలాల వారీగా ఒక్కో స్థానానికి ఒకటి చొప్పున 7,219 టేబుళ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 515 జెడ్పీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు కోసం వేరుగా 4,008 టేబుళ్లను సిద్ధం చేశారు.  చదవండి: 30 వరకు నైట్‌ కర్ఫ్యూ

ఐదున్నర నెలల తర్వాత..
బ్యాలెట్‌ బాక్స్‌లు దాచి ఉంచిన స్ట్రాంగ్‌ రూంలను పోలింగ్‌ జరిగిన ఐదు నెలల తర్వాత తెరవనున్నారు. దీంతో మొదట బ్యాలెట్‌ బాక్స్‌లు శుభ్రం చేసుకోవడం వంటి కారణాలతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ నీర్ణీత సమయం కంటే కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. దీనికితోడు బ్యాలెట్‌ పేపరు ద్వారా ఎన్నికలు కావడంతో లెక్కింపు ప్రక్రియ ఆలస్యమవుతుందని అధికారులు భావిస్తున్నారు. అయినప్పటికీ మధ్యాహ్నం రెండు గంటల సమయానికి దాదాపు అన్ని చోట్ల ఎంపీటీసీ ఎన్నికల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని.. జెడ్పీటీసీ ఫలితాలు మాత్రం రాత్రి వరకు సమయం పట్టే అవకాశం ఉందని అధికారుల వర్గాలు పేర్కొన్నాయి. 

అన్ని జాగ్రత్తల మధ్య కౌంటింగ్‌ 
రాష్ట్ర ఆరోగ్య శాఖ సూచించిన మేరకు పూర్తి స్థాయిలో కోవిడ్‌ జాగ్రత్తలను పాటిస్తూ.. ఓట్ల లెక్కింపునకు తగిన రక్షణ ఏర్పాట్లు చేశాం. కౌంటింగ్‌ ప్రక్రియ సజావుగా సాగేలా సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. అభ్యర్థి, కౌంటింగ్‌ ఏజెంట్లు రెండు డోసుల వ్యాక్సిన్‌ పూర్తయినట్లు ధృవీకరణ పత్రం చూపాలి. లేదా ర్యాపిడ్‌ యాంటి జెన్‌ టెస్ట్‌/ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌లో నెగటివ్‌ ఉంటేనే లెక్కింపు కేంద్రం లోపలికి అనుమతిస్తామని ఇప్పటికే తెలిపాం. 
రాష్ట్ర స్థాయిలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ కార్యాలయంలో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నాం. 13 జిల్లాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించడానికి 13 మంది అధికారులను నియమించాం.
– గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement