ఫైల్ ఫోటో
సాక్షి, అమరావతి: టీడీపీకి రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం గట్టిషాక్ ఇచ్చింది. టీడీపీ మేనిఫెస్టోను రద్దు చేస్తున్నట్లు ఎస్‌ఈసీ తెలిపింది. మేనిఫెస్టోపై టీడీపీ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో ఎస్‌ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.కాగా వెంటనే మేనిఫెస్టోను వెనక్కు తీసుకోవాలంటూ టీడీపీకి ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలకు పంపిన మేనిఫెస్టో కాపీలను వెనక్కి తీసుకోవాలని సూచించింది. టీడీపీ మేనిఫెస్టోతో ఎలాంటి ప్రచారం నిర్వహించొద్దని ఎస్‌ఈసీ స్పష్టం చేసింది. చదవండి: తొలి విడత: ఇప్పటివరకు జిల్లాల వారీగా ఏకగ్రీవాలు
పార్టీలకు సంబంధం లేకుండా జరిగే పంచాయతీ ఎన్నికలకు టీడీపీ మేనిఫెస్టో ప్రకటించడంపై ఎస్‌ఈసీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేయగా... మేనిఫెస్టోపై టీడీపీని ఎస్‌ఈసీ వివరణ కోరింది. టీడీపీ నుంచి సంతృప్తికర సమాధానం రాకపోవడంతో మేనిఫెస్టోను రద్దు చేసినట్లు ఎస్‌ఈసీ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment