మున్సిపల్‌ ఎన్నికలు..ఎస్‌ఈసీ కీలక నిర్ణయం | SEC Key Decision On Municipal Elections In AP | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌ ఎన్నికలు..ఎస్‌ఈసీ కీలక నిర్ణయం

Published Sat, Feb 20 2021 8:45 PM | Last Updated on Sat, Feb 20 2021 9:05 PM

SEC Key Decision On Municipal Elections In AP - Sakshi

సాక్షి, అమరావతి : త్వరలో జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. నామినేషన్‌ వేసి మృతి చెందిన అభ్యర్థుల స్థానంలో ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన చేసింది. ఈ నెల 28వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోపు నామినేషన్‌ దాఖలుకు గడువుగా పేర్కొంది. వివిధ పార్టీల అభ్యర్థులు 56 మంది మృతి చెందినట్లు ఎస్‌ఈసీ ప్రకటించింది. ( బలవంతపు ఉపసంహరణలపై ఫిర్యాదుల్ని స్వీకరించండి )

కాగా, 12 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 75 మున్సిపల్‌, నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గత సోమవారం షెడ్యూల్‌ విడుదలైన సంగతి తెలిసిందే. షెడ్యూల్‌ ప్రకారం మార్చి 10న మున్సిపల్‌ ఎన్నికలు..14న ఓట్ల లెక్కింపు జరగనుంది. మార్చి 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణ గడువు.. అనంతరం అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు. మార్చి 8వ తేదీ సాయంత్రంతో అభ్యర్థుల ప్రచారం ముగియనుంది. అవసరమైతే మార్చి 13న రీ  పోలింగ్‌  నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌ నిర్ణయించింది. మార్చి 14న ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌ ప్రారంభమవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement