సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనపై వైఎస్సార్‌సీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సీఈఓతో వైఎస్సార్‌సీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మల్లాది విష్ణు సహా వైస్సార్‌సీపీ నేతలు భేటీ అయ్యారు. సీఎం వైఎస్ జగన్‌పై జరిగిన దాడి వెనుక కుట్ర కోణం ఉందని ఈసీకీ వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.
‘సీఎం జగన్‌పై జరిగిన దాడి ఘటనపై ఈసీకి ఫిర్యాదు చేశాం. సీఎం జగన్ ఎడమ కన్నుపై దాడి జరిగింది. ఈ ఘటనను ప్రధాని మోదీ సహా అందరూ ఖండించారు. రాజకీయాలకు అతీతంగా పలు రాష్ట్రాల నేతలు కూడా ఖండించారు. విపక్ష నేతలు రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు. దాడిపై ఘటనపై టీడీపీ నేతల వ్యాఖ్యలు హేయమైనవి.
దాడిలో పవర్‌ఫుల్ ఆయుధం వాడారు. షార్ప్ షూటర్‌తో దాడి చేసినట్లు ఉంది. చంద్రబాబు రెచ్చగొట్టే విధంగా మాట్లడుతున్నారు. రాజకీయాల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. చంద్రబాబు, టీడీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా.. నియంత్రించాలని ఈసీని కోరాం.
ఈ దాడి పథకం ప్రకారమే జరిగినట్టు స్పష్టం అవుతోంది. దాడికి ఉపయోగించిన ఆబ్జెక్ట్ చాలా వేగంతో సీఎం జగన్ కంటిపై తగిలి వెల్లంపల్లి కంటికి తగిలింది. కొంచెం ఉంటే వెల్లంపల్లి కన్నుపోయేది’ అని సజ్జల అన్నారు
దాడికి సంబంధించి ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదు.. ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment