ఎస్‌ఈసీ తెచ్చిన ప్రైవేటు యాప్‌నకు హైకోర్టు బ్రేక్‌ | Andhra Pradesh High Court Key Orders On SEC e Watch App Usage | Sakshi
Sakshi News home page

ఎస్‌ఈసీ తెచ్చిన ప్రైవేటు యాప్‌నకు హైకోర్టు బ్రేక్‌

Published Fri, Feb 5 2021 2:07 PM | Last Updated on Fri, Feb 5 2021 9:08 PM

Andhra Pradesh High Court Key Orders On SEC e Watch App Usage - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ఎస్‌ఈసీ తయారు చేసిన యాప్‌నకు ఏపీ టెక్నాలజీ సర్వీసెస్‌ నుంచి సెక్యూరిటీ సర్టిఫికేషన్ వచ్చేంతవరకు, ఈ యాప్‌‌ వినియోగాన్ని నిలిపివేయాలని న్యాయస్థానం ఆదేశించింది. కాగా పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ- వాచ్‌ పేరుతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఓ యాప్‌ను విడుదల చేశారు. దీని ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తామని తెలిపారు.

అయితే ప్రైవేటు యాప్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఈ- వాచ్‌కు సెక్యూరిటీ సర్టిఫికెట్‌ ఉందా అని ఎస్‌ఈసీ తరఫు న్యాయవాదిని ప్రశ్నించగా, 5 రోజుల్లో తీసుకువస్తామని సమాధానమిచ్చారు. ఈ నేపథ్యంలో అప్పటి వరకు ఈ యాప్‌ను ఉపయోగించవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 9వ తేదీకి వాయిదా వేసింది.

చదవండిటీడీపీ మేనిఫెస్టోను రద్దు చేసిన ఎస్‌ఈసీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement