సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల సంఘంపై తెలంగాణ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కరోనా పరిస్థితులపై ఉన్నత న్యాయస్థానం గురువారం విచారణ జరిపింది. క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నికలకు ఎందుకు వెళ్లారంటూ హైకోర్టు ప్రశ్నించింది. ప్రజల ప్రాణాల కంటే ఎన్నికలు విలువైనవా? అని వ్యాఖ్యానించింది. యుద్ధం వచ్చినా.. ఆకాశం మీద పడినా ఎన్నికలు జరగాలా? అంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
అయితే, రాష్ట్ర ప్రభుత్వ ఏకాభిప్రాయంతోనే ఎన్నికలు నిర్వహిస్తున్నామని ఎస్‌ఈసీ తెలిపింది. మరి ఫిబ్రవరిలో కోవిడ్ రెండో దశ మొదలైతే.. ఏప్రిల్‌లో నోటిఫికేషన్ ఎందుకిచ్చారని హైకోర్టు ప్రశ్నించింది. ఎన్నికల ప్రక్రియపై ప్రభుత్వాన్ని అడగాల్సిన అవసరం ఏంటని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎన్నికల వాయిదాకు సొంతంగా నిర్ణయం తీసుకునే అధికారం మీకు లేదా? అని ఎస్‌ఈసీని ప్రశ్నించింది. ఎస్‌ఈసీ వివరణ సంతృప్తికరంగా లేదని హైకోర్టు పేర్కొంది. కాసేపట్లో ఎన్నికల సంఘం అధికారులు విచారణకు రావాలని హైకోర్టు ఆదేశించింది.
చదవండి: కరోనా బాధితులకు గుడ్ న్యూస్: ఫోన్ కొడితే.. ఇంటి వద్దకే..
కొనసాగుతున్న కరోనా ఉధృతి, రికార్డు స్థాయిలో కేసులు
Comments
Please login to add a commentAdd a comment