
సాక్షి, అమరావతి: రాష్ట్రపతి పర్యటనలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ పంచాయతిరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రాష్ట్ర హైకోర్టు అనుమతి ఇచ్చింది. మంత్రి పెద్దిరెడ్డిని ఫిబ్రవరి 21వ తేదీ వరకు నిర్భందించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఎస్‌ఈసీ ఆదేశాలను సవాలు చేస్తూ.. మంత్రి పెద్దిరెడ్డి ఆదివారం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం రాష్ట్రపతి పర్యటనలో పాల్గొనందుకు అనుమతినిచ్చింది. మంత్రి పెద్దిరెడ్డి తరుపున న్యాయవాది సీవీ మోహన్ రెడ్డి వాదనలు వినిపించారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆ శాఖ మంత్రిగా రాష్ట్రంలో పర్యటించాల్సిన బాధ్యత అతనిపై ఉందని న్యాయస్థానానికి వివరించారు. పటిషనర్ వాదనలు విన్న న్యాయస్థానం ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు తుది తీర్పు వెలువరించనున్నది.
చదవండి: నిర్బంధ ఉత్తర్వులు ఏకపక్షం
రాష్ట్రంలో నాలుగు దశల పంచాయతీ ఎన్నికలు ముగిసే ఫిబ్రవరి 21వ తేదీ వరకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆయన ఇంటి నుంచి బయటకు రాకుండా నియంత్రించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను ఆదేశిస్తూ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజ్యాంగంలోని 243 కె నిబంధన ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తనకు ఉన్న విశేషాధికారాలతో ఈ ఆదేశాలు జారీ చేశానని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 16 రోజుల పాటు మంత్రి పెద్దిరెడ్డిని మీడియాతో కూడా మాట్లాడకుండా నియంత్రించాలని చెప్పిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment