
సాక్షి, అమరావతి : వివిధ కారణాలతో సర్పంచి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఆగిపోయిన చోట తిరిగి నిర్వహించే అంశంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలంసాహ్ని గురువారం పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఆ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్‌లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో నీలంసాహ్నితో భేటీ అయ్యారు. ఎన్నికలు ఆగిపోయిన స్థానాల వివరాలు అందజేశారు. తిరిగి ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే విషయంపై చర్చించినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment