సాక్షి, అమరావతి: టీడీపీ అక్రమాలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. ఎస్ఈసీ నీలం సాహ్నికి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, నారాయణమూర్తి ఫిర్యాదు చేశారు. మున్సిపల్, జెడ్పీ ఉప ఎన్నికల్లో టీడీపీ కుట్రలకు తెరలేపిందని లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు రాజకీయ విలువలను దిగజారుస్తున్నారన్నారు. కుప్పంలో టీడీపీ నేతలు అమర్నాథ్‌రెడ్డి, పులివర్తి నాని దౌర్జనాలు చేస్తున్నారన్నారు. కుప్పం పర్యటనలో లోకేష్ న్యాయస్థానాల విలువలను దిగజార్చేలా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు ఓటర్లను భయపెడుతూ, ప్రలోభాలకు గురిచేస్తున్నారని లేళ్ల అప్పిరెడ్డి అన్నారు.
చదవండి: kuppam: ఓటర్లను నేరుగా ప్రలోభపెడుతున్న చంద్రబాబు
‘‘కుప్పం వెళ్లాలని చంద్రబాబు స్పెషల్ ఫ్లైట్ సిద్ధం చేసుకున్నారు. చంద్రబాబుకు కుప్పంలో ఓటు లేదు. ఎందుకు వెళ్తున్నారు. టీడీపీ అరాచకాలపై ఆధారాలతో సహా ఈసీకి ఫిర్యాదు చేశాం. కుప్పంలో చంద్రబాబు ఓటరు కాదు.. నారావారి పల్లెలో కూడా బాబుకు ఓటు లేదు. దొంగ ఓట్లు వేయించే కల్చర్ టీడీపీదే.. ప్రశాంతంగా ఉన్న ఏరియాలో అలజడి సృష్టించాలని టీడీపీ కుట్రలు చేస్తోందని’’ లేళ్ల అప్పిరెడ్డి దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment