రాష్ట్రంలో 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల పోలింగ్ సాయత్రం 5 గంటలకు ముగిసింది. ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. క్యూలైన్లలో ఉన్న ఓటర్లకు ఓటు వేసే అవకాశం కల్పిస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు. కాగా, ఈ నెల 18న ఓట్ల లెక్కింపు జరగనుంది.
Live Updates
TIME: 5:00PM
అనంతపురం: అనంతపురం జిల్లాలోని చిలమత్తూరు జెడ్పీటీసీ, 16 ఎమ్పీటీసీలకు జరిగిన ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ కేంద్రాల గేట్స్‌ను అధికారులు మూసేశారు. 5 గంటల తర్వాత క్యూలైన్లలో ఉన్న వారికి మాత్రమే ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. జెడ్పీటీసీ, ఎమ్పీటీసీ ఎన్నికల్లో 65 శాతం పోలింగ్ నమోదైంది.
Time 4:00 PM
►నెల్లూరు జిల్లా:
కోట జడ్పీ హైస్కూల్లో జరుగుతున్న ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ సరళిని ఆర్డీఓ మురళీకృష్ణ పరిశీలించారు. సాయంత్రం 4 గంటలవరకు 56.3 శాతం పోలింగ్ నమోదు.
►పశ్చిమగోదావరి జిల్లా:
పెనుగొండ మండలం జెడ్పీటీసీ ఎన్నికలో సాయంత్రం 4 గంటల వరకు 65.2 శాతం పోలింగ్ నమోదు.
► గుంటూరు జిల్లా: శావల్యాపురం మండలం వేల్పూర్ లో జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలకు వెళ్లిన టీడీపీ అభ్యర్థి పారా హైమావతి ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని ఓటర్లు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పోలింగ్ కేంద్రంలో క్యూ లైన్ లో ఓటర్ ను ప్రభావితం చేస్తున్న హైమావతిని పోలీసులు బయటికి పంపించారు. దీంతో ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
► తూర్పు గోదావరి జిల్లా:
కోరుకొండ మండలం పశ్చిమ గానుగూడెంలో 4గంటలకు నమోదైన పోలింగ్ శాతం 73.64%.
► ప్రకాశం జిల్లా:
పెద్దారవీడు మండలం తంగిరాల పల్లి ఎంపీటీసీ స్థానానికి సంబంధించి 4 గంటలకు 72.23% పోలింగ్ నమోదు.
Time 3:00 PM
► కర్నూలు జిల్లా
జిల్లాలో నంద్యాల జడ్పీటీసీ, బైచిగేరి, ధనాపురం, హానవాలు, చాగలమర్రి, టి. గోకులపాడు, మల్లేపల్లి, చాకరాజువేముల ఎంపీటీసీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో మధ్యాహ్నం 3 గంటలకు 57.33 శాతం పోలింగ్ నమోదు.
► నెల్లూరు జిల్లా
కోవూరు మండలం గంగవరం ఎంపీటీసీ ఎన్నికలో 3 గంటలకు 62 శాతం పోలింగ్ నమోదు
► పశ్చిమగోదావరి జిల్లా:
సాయంత్రం 3 గంటల వరకు నుగొండ మండలం జడ్పీ, ఎంపీటీసీ 59.97 శాతం పోలింగ్ శాతం.
► కృష్ణా జిల్లా
జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్
పెడన జడ్పీటీసీ 61.20 శాతం
జి.కొండూరు జడ్పీటీసీ 54.92 శాతం
విస్సన్నపేట జడ్పీటీసీ 44.49 శాతం
ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్
ఆగిరిపల్లి (మం) ఈదర-1: ఎంపీటీసీ 74.88 శాతం
గన్నవరం (మం) చినఅవుటుపల్లి - ఎంపీటీసీ 60.90 శాతం
నూజివీడు (మం) దేవరకుంట - ఎంపీటీసీ 67.69 శాతం
నాగాయలంక (మం) పర్రచివర - ఎంపీటీసీ 57.62 శాతం
ముదినేపల్లి (మం) ముదినేపల్లి-2: ఎంపీటీసీ 49.23
వణుదుర్రు ఎంపీటీసీ 56.59 శాతం
పెనుగంచిప్రోలు (మం) కొనకంచి- ఎంపీటీసీ 67.62 శాతం
Time: 2:00 PM
► ప్రకాశం జిల్లా: పిసి పల్లి మండలం మురుగమ్మి ఎంపీటీసీ స్థానంలో ఇప్పటివరకు 78% పోలింగ్ నమోదు నమోదైంది.
► విశాఖ జిల్లా : ఆనందపురం మండలం వెల్లంకి, వేములవలస జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ మల్లికార్జున సందర్శించారు. జిల్లాలో జరుగుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఇప్పటివరకు 51 శాతం పోలింగ్ నమోదైంది.
► నెల్లూరు జిల్లా: సైదాపురం మండలం ఆనంతమడుగు ఎంపీటీసీ స్థానాన్నికి జరుగుతున్న పోలింగ్ సరళిని ఎన్నికల పరిశీలకులు బసంత్ కుమార్, గూడూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి పరిశీలించారు.
► తూర్పుగోదావరి జిల్లా:
♦ ఎటపాక మండలం 12 ఎంపీటీసీ స్థానాలకు 2 గంటలకు 69.4% శాతం పోలింగ్ నమోదైంది.
♦ వి ఆర్ పురం మండలం, చిన్నమట్టపల్లి ఎంపీటీసీ స్థానానికి 71% ఓటింగు నమోదు.
♦ కపిలేశ్వరపురం మండలం వాక తిప్ప నాగులచెరువు ఎంపీటీసీ స్థానానికి సంబంధించి 2 గంటలకు పోలింగ్ శాతం 55.90% ఓటింగు నమోదు.
♦ సీతానగరం మండలం కాటవరం ఎంపీటీసీ స్థానాలు సంబంధించి 2గంటలకు పోలింగ్ శాతం 60.6% ఓటింగు నమోదు.
♦ ఏజెన్సీ ప్రాంతం కావడంతో ముందస్తు ప్రణాళిక ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకే ముగిసిన పోలింగ్ .వి ఆర్ పురం మండలం, చిన్నమట్టపల్లి ఎంపీటీసీ స్థానానికి 72% పోలింగ్ నమోదు.
Time: 1.25 PM
►గుంటూరు జిల్లా: ప్రత్తిపాడు మండలం నడింపాలెంలో జరుగుతున్న ఎంపీటీసీ ఎన్నికలను గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరీఫ్ పరిశీలించారు.
► కృష్ణాజిల్లా: మధ్యాహ్నం 1 గంట వరకు జి.కొండూరు జడ్పీటీసీలో 43.7 శాతం, విస్సన్నపేట జడ్పీటీసీలో 36 శాతం, పెడన జడ్పీటీసీ 48 శాతం పోలింగ్ నమోదైంది.
► కర్నూలు: జిల్లాలో నంద్యాల జడ్పీటీసీ, బైచిగేరి, ధనాపురం, హానవాలు, చాగలమర్రి, టి. గోకులపాడు, మల్లేపల్లి, చాకరాజువేముల ఎంపీటీసీ స్థానాల్లో మధ్యాహ్నం ఒంటి గంట 50.18 శాతం పోలింగ్.
► పశ్చిమగోదావరిజిల్లా: జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం12 గంటల వరకు పెనుగొండ జడ్పీటీసీలో 39.63 శాతం పోలింగ్ నమోదైంది.
Time: 12.25 PM 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.
► కృష్ణా జిల్లాలోని జి.కొండూరులో జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ సిద్దార్ధ్ కౌశల్ పరిశీలించారు.
Time: 11.25 AM
► 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.
► కృష్ణా జిల్లా: ఉదయం 11 గంటలకు జడ్పీటీసీ పోలింగ్ శాతాలు.. జి.కొండూరు జడ్పీటీసీ-28.18 శాతం, విస్సన్నపేట జడ్పీటీసీ- 16 శాతం, పెడన జడ్పీటీసీ-26.80 శాతం నమోదైంది.
Time: 10.25 AM
► 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు.
Time: 9.30 AM
► 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.
► కృష్ణాజిల్లా: ఉదయం 9 గంటలకు జీ.కొండూరు జడ్పీటీసీ పోలింగ్‌లో 10 శాతం, విస్సన్నపేట జడ్పీటీసీ పోలింగ్‌లో 8.5 శాతం, పెడన జడ్పీటీసీ పోలింగ్‌లో 10.24 శాతం పోలింగ్ నమోదైంది.
► కర్నూల్ జిల్లా: కృష్ణగిరి మాండలం టి.గోకులపాడు ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌లో 9 గంట వరకు 18.94 శాతం పోలింగ్ నమోదైంది.
Time: 8.30 AM
► 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. వృద్దులు, వికలాంగులుకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇబ్బంది లేకుండా పోలింగ్ కేంద్రల వద్ద ఎన్నికల అధికారులు వీల్ చైర్లను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ పోలీసులు అమలు చేస్తున్నారు.
Time: 7.20 AM
► రాష్ట్రంలోని 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాడానికి పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు.
Time: 7.00 AM
► రాష్ట్రంలోని 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. వివిధ కారణాలతో అప్పట్లో ఆగిపోయిన, గెలిచినవారు చనిపోయిన కారణంగా ఆయా స్థానాల్లో ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. మంగళవారం 954 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.
► ఈ పోలింగ్‌లో 8,07640 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. జడ్పీటీసీ స్థానాల్లో 40 మంది, ఎంపీటీసీ స్థానాల్లో 328 మంది పోటీలో ఉన్నారు. ఓట్లను ఈనెల 18న లెక్కిస్తారు.
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 10 జెడ్పీటీసీ స్థానాలకు, 123 ఎంపీటీసీ స్థానాలకు మంగళవారం ఎన్నికలు జరగనున్నాయి. వివిధ కారణాలతో అప్పట్లో ఆగిపోయిన, గెలిచినవారు చనిపోయిన కారణంగా ఆయా స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవికాకుండా గతంలో ఓట్ల లెక్కింపు సమయంలో తడిసిన ఓట్ల కారణంగా లెక్కింపు ఆగిపోయిన వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు జెడ్పీటీసీ స్థానంలో రెండు బూత్‌లతోపాటు మరో ఆరు ఎంపీటీసీ స్థానాల్లోను మంగళవారం ఫ్రెష్ (రీ) పోల్ నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు చెప్పారు. మొత్తం 14 జెడ్పీటీసీ స్థానాలు, 176 ఎంపీటీసీ స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీచేశారు.
వీటిలో నాలుగు జెడ్పీటీసీ స్థానాలు, 50 ఎంపీటీసీ స్థానాల ఎన్నిక ఏకగ్రీవం అయిన సంగతి తెలిసిందే. మూడు ఎంపీటీసీ స్థానాల్లో ఎవరూ నామినేషన్ల దాఖలు చేయకపోవడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. మిగిలినచోట్ల 954 పోలింగ్ కేంద్రాల్లో మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. జెడ్పీటీసీ స్థానాల్లో 40 మంది, ఎంపీటీసీ స్థానాల్లో 328 మంది పోటీలో ఉన్నారు. మొత్తం 8,07,640 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఓట్లను ఈనెల 18న లెక్కిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment