సాక్షి,కృష్ణా: రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వార్డు వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి దూరంగా ఉంచాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారి చేసింది. ఈ మేరకు ఎస్‌ఈసీ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గాని ఎన్నికల విధుల్లో వాలంటీర్లు ఉండకూడదు. ఫోటో ఓటరు స్లిప్పుల పంపిణీలో వాలంటీర్లు పాల్గొనకూడదని ఉత్తర్వుల్లో తెలిపింది.
ఎన్నికల సమయంలో వాలంటీర్ల పై నిఘా ఉంచడంతో పాటు... వారి ఫోన్లను స్వాధీనం చేసుకోవాలి. ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందనే ఈ ఆదేశాలు ఇస్తున్నట్లు ఎస్‌ఈసీ తెలిపింది. నిబంధనలకు విరుద్ధంగా వాలంటీర్లను వినియోగిస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద భావించి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment