గోపాల కృష్ణ ద్వివేది(పాత చిత్రం)
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి(సీఈఓ) గోపాల కృష్ణ ద్వివేదీ సెలవుపై వెళ్లారు. రేపటి నుంచి ఈ నెల 15 వరకు ద్వివేదీ సెలవులోనే ఉండనున్నారు. తిరిగి ఈ నెల 16న సచివాలయానికి ద్వివేదీ రానున్నారు. స్క్రీనింగ్ కమిటీ ఖరారు చేసిన క్యాబినేట్ అజెండాను కేంద్ర ఎన్నికల సంఘానికి సీఈఓ ద్వివేదీ పంపారు.
కేంద్ర ఎన్నికల కమిషన్(సీఈసీ) నుంచి అనుమతి రావడానికి కనీసం రెండు రోజుల సమయం పట్టే అవకాశముంది. సోమవారం సాయంత్రానికి క్యాబినేట్‌పై సీఈసీ నుంచి స్పష్టత రావచ్చని అధికారులు భావిస్తున్నారు. గోపాల కృష్ణ ద్వివేదీ సెలవుపై వెళ్లనుండటంతో క్యాబినేట్ ఎజెండా మరింత ఆలస్యం అయ్యే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment