
సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసనసభకు గత నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 175 స్థానాలకు ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారని గవర్నరు ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. తాజాగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరి పేర్లతో నివేదికను గవర్నరుకు ఆదివారం అందజేసింది.
రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ) గోపాలకృష్ణ ద్వివేది, ఈసీఐ ప్రిన్సిపల్ సెక్రటరి ఎస్‌కే రోడాల, అదనపు ప్రధాన ఎన్నికల అధికారులు సుజాత శర్మ, వివేక్ యాదవ్ తదితరులతో కూడిన బృందం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నరును కలిసి కొత్త ఎమ్మెల్యేల జాబితాను సమర్పించింది. దీంతో ప్రభుత్వం 175 మంది ఎమ్మెల్యేలు ఎన్నికైనట్లు వారి పేర్లతో గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది.