ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదికలు పంపారు. నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో రెండేసి చొప్పున.. ప్రకాశం జిల్లాలో ఒక చోట రీపోలింగ్‌కు స్థానిక కలెక్టర్లు ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేదీకి నివేదికలు పంపారు.