రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఒకటి రెండు చోట్ల పోలీసులు ప్రచారాన్ని ఆపారని అన్నారు. ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తులు ఆ ప్రాంతంలో ఉండరాదని.. బయట వ్యక్తులు వాళ్ల ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశామని.. నగదు, మద్యం, కానుకల స్వాధీనంలో ఏపీ రెండో స్థానంలో ఉందన్నారు.
Published Tue, Apr 9 2019 7:27 PM | Last Updated on Fri, Mar 22 2024 11:32 AM
Advertisement
Advertisement
Advertisement