అంతాపూర్ గ్రామం,రెండు రాష్ట్రాల కార్డులు చూపుతున్న పరందోళి వాçసులు
సాక్షి, కెరమెరి(ఆదిలాబాద్) : రెండు రాష్ట్రాలు.. ఇటు తెలంగాణ, అటు మహారాష్ట్ర.. ఈ రెండు ప్రభుత్వాలు కుమురంభీం జిల్లా కెరమెరి మండలంలోని సరిహద్దున ఉన్న వివాదాస్పద 14 గ్రామాలను ఏళ్లతరబడి పాలిస్తున్నాయి. కాని ఆ గ్రామాల్లో కనీసం తాగునీటి సమస్యను కూడా తీర్చని పరిస్థితి. ప్రతీ గ్రామాన్ని కదిలించిని క‘న్నీటి’ గాథలే దర్శనమిస్తున్నాయి. ఈ నెల 21న మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా రాజూర నియోజకవర్గానికి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మండలానికి చెందిన 2800 మంది ఓటర్లు తమ ఓటును సద్వినియోగం చేసుకోనున్నారు. పుడ్యాన్ మొహదా, వనీ, నోకేవాడ, పరందోలి, కుంభేఝరి, భొలాపటార్ గ్రామాల్లో పోలింగ్ బూత్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
సరిహద్దు గ్రామాలు..
పరందోళి, అంతాపూర్, భోలాపటార్, ముకదంగూడ గ్రామ పంచాÄ ¶æుతీల్లోని పరంధోళి, కోటా, పరందోళి తాండ, ముకద్దంగూడ, మహరాజ్‌గూడ, లేండిజాల, అంతాపూర్, ఇంద్రానగర్, పద్మావతి, ఎసాపూర్, నారాయనగూడ, భోలాపటార్, లేం డిగూడ, గౌరి ఉన్నాయి.
ఐదు గ్రామపంచాయతీల్లో
14 వివాదాస్పద సరిహద్దు గ్రామాలు మహారాష్ట్రలోని ఐదు గ్రామ పంచాయతీల్లో ఉన్నాయి. అందులో పరంధోళిలో గ్రామ పంచాయతీలో ముకదంగూడ, కొటా, పరందోళి, లేండిజాల గ్రామాలు ఉండగా.. పుడ్యాన్ మొహదాలో శంకర్‌లొద్ది, ఇంద్రానగర్, అంతాపూర్, పద్మావతీ, నోకేవాడలో మహారాజ్‌గూడ, కుంభేఝరిలో నారాయణగూడ, ఎసాపూర్, భోలాపటార్, లేండిగూడ, చిక్లి గ్రామ పంచాయతీల్లో గౌరి గ్రామాలు ఉన్నాయి.
సాగుపట్టాలే ప్రధాన సమస్య!
ఏళ్లుగా ఆయా గ్రామాల ప్రజలకు ప్రధాన సమస్య సాగుభూములకు పట్టాలివ్వడం. ఆయా గ్రామాల్లో వేల ఎకరాల్లో సాగు భూమి ఉన్నప్పటికీ 80 శాతం రైతులకు పట్టాలు లేవు. ఇటు తెలంగాణ ప్రభుత్వం, అటు మహారాష్ట్ర ప్రభుత్వం పట్టాలివ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రతిసారి ప్రచారం కోసం వచ్చిన అభ్యర్థులను గెలిపిస్తే పట్టాలిప్పిస్తామని హామీ ఇవ్వడం పరిపాటిగా మారింది.
రెండు ప్రభుత్వాలున్నా.. అభివృద్ధి శూన్యమే
రెండు ప్రభుత్వాలున్నా ఎలాంటి అభివృద్ధి మాత్రం కానరావడం లేదు. రెండు రాజ్యాలకు చెందిన ఇద్దరు సర్పంచ్‌లు, ఇద్దరు ఎంపీటీసీలు ఆ గ్రామాల్లో ఉన్నా ప్రతి ఒక్కరికీ రెండేసి రేషన్‌కార్డులు, రెండేసి ఓటరు కార్డులున్నాయి. రెండు పాఠశాలలు, రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, రెండు అంగన్‌వాడీ కేంద్రాలు, ఇరువైపులా ప్రభు త్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న అవి వీరి దరిచేరడం లేదు.
ముగిసిన ప్రచారం..
వారం రోజులుగా హోరాహోరిగా సాగిన ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో 5గంటలతో ముగిసింది. ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు తప్ప స్వతంత్ర అభ్యర్థులు పెద్దగా ప్రచారం నిర్వహించలేదు. పోటీ మాత్రం సేత్‌కారి సంఘటన అభ్యర్థి వామన్రావు చటప్, బీజేపీ అభ్యర్థి సుభాష్‌రావు ధోటే మధ్యలోనే ఉంటుందని చెబుతున్నారు.
సరిహద్దు గ్రామాలు | 14 |
పోలింగు కేంద్రాలు | 06 |
ఓటర్లు | 2803 |
పోలింగ్ తేదీ | ఈ నెల 21 |
సమయం | ఉ: 7:30 గం నుంచి సా: 5:00 గం వరకు |
పోటీ చేసే అభ్యర్థులు | :12 మంద |
పని చేసే వారికే
పనిచేసే వారికే ఓటు వేస్తాం. ఇప్పటికీ చాలా నష్టపోయి ఉన్నాం. ఎవ్వరూ వచ్చినా సమస్యలు తీర్చుతామంటున్నారు. కానీ తరువాత మర్చిపోతున్నారు. గ్రామ పంచాయతీల్లో నిధులు చాలా తక్కువగా ఉంటాయి.
– కాంబ్డె లక్ష్మణ్, సర్పంచ్ పరంధోళి (మహారాష్ట్ర)
పట్టాలివ్వాలి
మేము గడిచిన 40 సంవత్సరాల నుంచి భూములను సాగుచేస్తున్నప్పటికీ నేటికీ సాగుభూములకు పట్టాలులేవు. ఇరు ప్రభుత్వాలు కూడా పట్టాలు ఇవ్వక పోవడంతో సంక్షేమ పథకాలు అందడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment