
కాంగ్రెస్ నేత అఖిలేశ్ ప్రసాద్ సింగ్
న్యూఢిల్లీ: దేశంలో ఎన్నికలొచ్చినప్పుడే.. సరిహద్దుల్లో సర్జికల్ స్ట్రైకులొస్తున్నాయని.. వాస్తవ సమస్యలను మరుగుపరిచేందుకే బీజేపీ సైనికులను అడ్డుపెట్టుకుని ఆటలాడుతోందని కాంగ్రెస్ నేత అఖిలేశ్ ప్రసాద్ సింగ్ వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్, హరియాణా ఎన్నికలకు ఒక్కరోజు ముందే ఈ దాడులు బయటకు రావడం వెనుక మతలబేంటని ఆయన ప్రశ్నించారు. పెద్ద ఎన్నికలు వచ్చినప్పుడల్లా సర్జికల్ స్ట్రైక్స్ కనిపించడం మోదీ ప్రభుత్వంలో సర్వసాధారణమైందని ఎద్దేవా చేశారు. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వి మాత్రం భారత సైనికుల ధైర్యసాహసాలను మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. సైనికుల ధైర్యాన్ని చూసి గర్విస్తున్నామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment