ఏపీలో కాంగ్రెస్‌కు 1శాతమే ఓట్లు | congress 1 percent results in lok sabha elections andhra pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో కాంగ్రెస్‌కు 1శాతమే ఓట్లు

Published Fri, May 24 2019 4:39 AM | Last Updated on Fri, May 24 2019 4:39 AM

congress 1 percent results in lok sabha elections andhra pradesh - Sakshi

న్యూఢిల్లీ: రాష్ట్రాల వారీగా చూస్తే, కాంగ్రెస్‌ పార్టీకి తాజా ఎన్నికల్లో ఓట్ల శాతం ఘోరంగా తగ్గింది. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఒక్క శాతం మేర మాత్రమే ఓట్లు పోలయ్యాయి. సిక్కిమ్‌లో కూడా ఈ పార్టీకి ఈ స్థాయిలోనే ఓట్లు వచ్చాయి. ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లో 6 శాతం ఓట్లు రాగా,  ఒక్క పాండిచ్చేరిలో మాత్రమే 57 శాతం ఓట్లు, అధికారంలో ఉన్న పంజాబ్‌ రాష్ట్రంలో 40 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. అంతే కాకుండా రాజకీయంగా కీలకమైన ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బిహార్, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో విపక్షాలకు ఒక్క అంకె శాతంలోనే ఓట్లు పోలయ్యాయని ఎలక్షన్‌ కమిషన్‌ గణాంకాలు వెల్లడించాయి.

► రాష్ట్రాల వారీగా చూస్తే, కాంగ్రెస్‌ పార్టీకి తాజా ఎన్నికల్లో ఓట్ల శాతం ఘోరంగా తగ్గింది. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఒక్క శాతం మేర మాత్రమే ఓట్లు పోలయ్యాయి. సిక్కిమ్‌లో కూడా ఈ పార్టీకి ఈ స్థాయిలోనే ఓట్లు వచ్చాయి. ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లో 6 శాతం ఓట్లు రాగా,  ఒక్క పాండిచ్చేరిలో మాత్రమే 57 శాతం ఓట్లు, అధికారంలో ఉన్న పంజాబ్‌ రాష్ట్రంలో 40 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. మరోవైపు తెలంగాణలో బీజేపీకి 20 శాతం ఓట్లు రాగా, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 0.9 శాతం ఓట్లు పోలయ్యాయి.

► తొలి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి 45 శాతం ఓట్లు వచ్చాయి. 1971 ఎన్నికల వరకూ 40 శాతం ఓట్లు పోలవుతూనే ఉన్నాయి. 1977 ఎన్నికల్లో 34.5 శాతానికి తగ్గిన కాంగ్రెస్‌ ఓట్లు 1980లో 42.7 శాతానికి, 1984/85 ఎన్నికల్లో 48.1 శాతానికి పెరిగాయి. అప్పటి నుంచి కాంగ్రెస్‌ ఓట్ల శాతం తగ్గుతూ వస్తోంది. 1989లో 39.5 శాతానికి తగ్గిన కాంగ్రెస్‌ ఓట్లు 1996–2009 మధ్య 20 శాతం లోపు పడిపోయాయి. 2014లో అంతకంటే తక్కువ ఓట్లు వచ్చాయి.


13 రాష్ట్రాల్లో బీజేపీకి 50 శాతానికి మించి ఓట్లు
న్యూఢిల్లీ: సీట్లు కొల్లగొట్టటంలోనే కాకుండా ఓట్ల శాతంలోనూ బీజేపీ హవా కొనసాగింది. మొత్తం 13 రాష్ట్రాల్లో 50 శాతానికి మించి ఓట్లు  బీజేపీకి వచ్చాయి.
► ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీకి రమారమి 50 శాతం ఓట్లు రాగా, హర్యానా, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌ఘర్, ఉత్తరఖండ్, గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్, గోవా, కర్నాటక, ఢిల్లీ, చంఢీగర్, అరుణాచల్‌ ప్రదేశ్‌ల్లో 50 శాతానికి మించి ఓట్లు పోలయ్యాయి. పశ్చిమ బెంగాల్‌లో దాదాపు 40 శాతం ఓట్లు సాధించిన ఈ పార్టీ జమ్మూ, కశ్మీర్‌ రాష్ట్రంలో 46 శాతం ఓట్లను సాధించింది.
► మిత్రపక్షాలతో కలిసి పోటీ చేసిన వివిధ రాష్ట్రాల్లో కూడా బీజేపీకి ఓట్ల శాతం పెరిగింది. పంజాబ్‌లో 10 శాతం, మహారాష్ట్రలో 27 శాతం, అస్సాంలో 35 శాతం, బీహార్‌లో 24 శాతం ఓట్లు రాగా తమిళనాడులో 3.34 శాతం ఓట్లే పోలయ్యాయి.  
► ఇక కేరళలో 3 శాతం, ఓడిశాలో 38 శాతం చొప్పున ఓట్లను ఈ పార్టీ సాధించింది.  
► 1984లో బీజేపీకి రెండు లోక్‌సభ సీట్లు వచ్చాయి. అప్పుడు ఆ పార్టీ ఓట్ల శాతం 7.74 శాతంగా ఉంది.1998 వరకూ ఆ పార్టీ ఓట్ల శాతం 25.29 శాతానికి పెరిగింది.  ఆ తర్వాత 2009 వరకూ జరిగిన వరుస మూడు ఎన్నికల్లో  ఆ పార్టీ ఓట్ల శాతం 19.5 శాతానికి తగ్గింది. 2014లో 31.34 శాతానికి ఎగసింది. తాజా ఎన్నికల్లో ఓట్ల శాతం 50 శాతానికి చేరువ అయింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement