
పెద్దపల్లి: ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌నేత స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఆయన మాట్లాడారు. ఉద్యోగాన్ని వదిలి ప్రజాసేవ చేసేందుకు వచ్చానని చెప్పారు. ఆదరించి గెలిపించిన సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తక్కువ సమయంలోనే తనను కలుపుకొని గెలిపించడానికి కృషి చేసిన టీఆర్‌ఎస్ నాయకులకు, నియోజకవర్గ ఓటర్లకు సేవకుడిగా ఉంటానని వెల్లడించారు.