న్యూఢిల్లీ: తాజాగా దక్కిన అధికారం ప్రధాని నరేంద్ర మోదీ పెట్టుబడి నిబంధనలను మరింత సడలించేందుకు అవకాశం ఇస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగైతే రిలయన్స్, మహీంద్రా, టాటా వంటి భారత ప్రైవేట్ రంగ దిగ్గజాలు వేల కోట్లు రక్షణ రంగంలో పెట్టుబడులుగా పెడతాయి. అప్పుడు భారత్‌ను ఓ పెద్ద సైనిక శక్తిగా తీర్చిదిద్దాలనే మోదీ ఆకాంక్ష నెరవేరుతుంది. స్వాతంత్య్రా నంతరం భారత రాజకీయ నాయకత్వం ముసాయిదా విధాన రూపకల్పనలో సైన్యాన్ని పక్కనపెట్టి ఔత్సాహికులకు, ఆ రంగంతో సంబంధం లేనివారికి, పిరికివాళ్లకు స్థానం కల్పించింది.
ఫలితంగా భారత వ్యూహాత్మక లక్ష్యాలు ఎదుగూబొ దుగూ లేకుండా ఉండిపోయాయి. మోదీ రంగంలోకి దిగేవరకు ఇదే కొనసాగింది. యుద్ధాలు గెలవడానికి అవసరమైన విధులు నిర్వర్తించడానికి వీలుగా సాయుధ దళాల్లోకి వృత్తి నిపుణులను అనుమతించిన తొలి ప్రధానిగా మోదీ నిలిచారు. ఈ నేపథ్యంలోనే స్వాతంత్య్రానంతరం మొదటిసారిగా పాకిస్తాన్ ఉగ్ర దాడులకు భీకర ఎదురుదాడులతో భారత్ ప్రతిస్పందించడం ప్రారంభించింది. ఒక దెబ్బకు రెండు దెబ్బలు తీయాలనే మోదీ విధానానికి బాలాకోట్ దాడులు ఓ చక్కని ఉదాహరణ.
జమ్మూకశ్మీర్‌లో 40 మంది జవాన్లను ఆత్మా హుతి బాంబర్ పొట్టన పెట్టుకున్న నేపథ్యంలో బాలాకోట్‌లో భారత సైన్యం వైమానిక దాడులు నిర్వహించింది. 12 యుద్ధవిమానాలు పాక్‌లోని అంతర్జా తీయ సరిహద్దు వెంబడి ఉగ్ర శిబిరాలపై బాంబుల వర్షం కురిపించాయి. భారత్ దాడులను ఆపడంలో పాక్ అసమర్ధత బట్టబయలైంది. మోదీ దూకుడు గా వ్యవహరించిన తీరు ఓ సైనిక శక్తిగా పాక్‌ను బాగా క్షీణింపజేసింది. ఈ పరిస్థితుల్లో మోదీ మళ్లీ ప్రధాని కావడమనేది పాకిస్తాన్‌కు రుచించని వార్తే.
Comments
Please login to add a commentAdd a comment