మోదీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు | PM-elect Narendra Modi to take oath on 30 May | Sakshi
Sakshi News home page

మోదీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు

Published Mon, May 27 2019 7:21 AM | Last Updated on Thu, Mar 21 2024 11:10 AM

భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ రెండోసారి ప్రమాణస్వీకారం చేసేందుకు ముహూర్తం ఖరారైంది. మే 30న రాత్రి 7 గంటలకు మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని రాష్ట్రపతి కార్యాలయం తెలిపింది. మోదీతో పాటు కొందరు మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేస్తారని వెల్లడించింది. రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మోదీ చేత ప్రమాణం చేయిస్తారని పేర్కొంది. ఎన్డీయే కూటమి మోదీని తమ నాయకుడిగా శనివారం ఎన్నుకున్న సంగతి తెలిసిందే.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement