
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో 8 స్థానాల్లో విజయం సాధిస్తామని తాము భావించామని, అయితే 3 స్థానాల్లో గెలుపొందినా తాము సేఫ్ జోన్‌లో ఉన్నామని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ లో బీజేపీ 4 పార్లమెంటు స్థానాల్లో గెలుపొందడం వల్ల తమకేమీ నష్టం లేదని, టీఆర్‌ఎస్ మాత్రం డేంజర్ జోన్ లో పడిందన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు మంచి తీర్పు ఇచ్చారని, ఉత్తమ్, కోమటిరెడ్డి, రేవంత్‌ల రూపంలో మూడు పులులు విజయం సాధించాయని చెప్పారు. భవిష్యత్తులో తమ పార్టీ నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లబోరని, టీఆర్‌ఎస్ నేతలే బీజేపీలోకి వెళతారని చెప్పారు. పీసీసీ అధ్యక్షుడిగా ఇప్పుడు పులులు అవసరం లేదని, వేదమంత్రాలు చదివే సాత్వికులు కావాలని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment