
ఓట్ల తొలగింపులో కూకట్‌పల్లి టాప్ !
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) పరిధిలో ఓట్ల తొలగింపు గందరగోళానికి దారితీసింది
1,21,085 ఓట్లు ఔట్
గ్రేటర్‌లో తొలగించిన మొత్తం ఓట్లు 4,77,972
మరో 1,78, 043 మందికి త్వరలో నోటీసులు
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) పరిధిలో ఓట్ల తొలగింపు గందరగోళానికి దారితీసింది. దీనిపై ఆయా పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఆచితూచి వ్యవహరించి అన్ని జాగ్రత్తలు తీసుకుని ఓటర్లను తొలగించావుని అధికారులు చెబుతుండగా.. ఏకపక్షంగా తొలగించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారుు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేపట్టింది. త్వరలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో ఓట్ల తొలగింపు చర్చనీయూంశంగా వూరింది. గ్రేటర్ పరిధిలోని 18 (పాత)సర్కిళ్లలో అత్యధికంగా కూకట్‌పల్లి సర్కిల్‌లోని 1,21,085 ఓట్లను అధికారులు తొలగించారు.
కూకట్‌పల్లి తర్వాతి స్థానంలో ఖైరతాబాద్ ఉంది. తక్కువ ఓట్లు తొలగించిన సర్కిల్‌గా ఉప్పల్ మిగిలింది. ఎన్నికల జాబితాలో రెండుచోట్ల పేర్లున్నవారు(డూప్లికేట్లు), చిరునామా మారినవారు, తాళాలు వేసిన ఇళ్లు, మృతుల వివరాల ఆధారంగా ఓట్లు తొలగించాల్సివారు మొత్తం 27,12,468 మంది ఉన్నట్లు గుర్తించిన అధికారులు 25,34,425 మంది బాధ్యులకు నోటీసులు జారీ చేశారు. మరో 1,78, 043 మందికి త్వరలో నోటీసులు జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
నిబంధనల మేరకే.. : సోమేశ్‌కుమార్
ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నియమనిబంధనల మేరకు ఓటర్ల జాబితాలను బహిరంగపరిచామని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ అన్నారు. ‘నోటీసులు జారీ చేసి, స్థానికంగా ఉంటున్నట్లు వివరణనిచ్చేందుకు తగిన గడువునిచ్చి, అప్పటికీ స్పందించనివారినే ఓటర్ల జాబితా నుంచి తొలగించాం. ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో కూడా ఈ వివరాలు పొందుపరిచాం. లక్షలాది ఓట్లను ఏకపక్షంగా తొలగించామనే ఆరోపణల్లో వాస్తవం లేదు. అర్హులను తొలగించలేదు.’ అని శనివారం విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు.
అర్హులు మళ్లీ నమోదు చేసుకోవచ్చు
ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఎన్నికల అధికారి అనర్హులుగా భావించినవారిని ఓటర్ల జాబితాలోంచి తొలగించారు. అర్హులైనవారు స్థానికంగా ఉంటున్నట్లు తగిన ఆధారాలు చూపితే వారి పేర్లను తిరిగి నమోదు చేస్తాం. స్థానిక సర్కిల్ కార్యాలయాల్లోగాని, ఆన్‌లైన్ ద్వారా కానీ దరఖాస్తు చేసుకోవచ్చు.
- సి.రామకృష్ణారావు, అడిషనల్ కమిషనర్