వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా నుంచి అక్రమంగా ఓట్ల తొలగింపు, ఇతర అవకతవకలపై కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసేందుకు ఆయన ఢిల్లీకి వెళ్లారు. ఆయన వెంట పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీ మిథున్ రెడ్డిలు ఉన్నారు.