రేపు సీఈసీని కలవనున్న వైఎస్‌ జగన్‌ | YS Jagan Mohan Reddy Visit to Delhi Today | Sakshi
Sakshi News home page

రేపు సీఈసీని కలవనున్న వైఎస్‌ జగన్‌

Published Sun, Feb 3 2019 3:45 PM | Last Updated on Sun, Feb 3 2019 4:42 PM

YS Jagan Mohan Reddy Visit to Delhi Today - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓటర్ల జాబితా నుంచి అక్రమంగా ఓట్ల తొలగింపు, ఇతర అవకతవకలపై కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీకి బయల్దేరారు.

పార్టీకి చెందిన మాజీ ఎంపీలు, ముఖ్య నేతలతో కలిసి ఆయన ఆదివారం సాయంత్రం ఢిల్లీకి పయనమయ్యారు. సోమవారం ఉదయం 11.30గంటలకు వైఎస్‌ జగన్‌ పార్టీ నేతలతో కలిసి చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ (సీఈసీ)ను కలుస్తారు. ఓటర్ల జాబితాలో పెద్దఎత్తున చోటుచేసుకున్న అవకతవకలు, అక్రమంగా పేర్ల తొలగింపు అంశాలతోపాటు రాష్ట్ర డీజీపీ వ్యవహారశైలిపైనా సీఈసీకి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement