సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల చేయవద్దని ఆదేశాలు జారీచేసినట్లు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలక్రిష్ణ ద్వివేదీ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా కడపలో రెండు థియేటర్లలో సినిమా ప్రదర్శించారని, ఆ థియేటర్‌ల లైసెన్సులు రద్దు చేయాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సినిమా ప్రదర్శన అడ్డుకోలేకపోయిన కడప జిల్లా జాయింట్ కలెక్టర్‌పై చర్యలకు కేంద్ర సీఈసీకి సిఫార్స్ చేశామని చెప్పారు. రీ పోలింగ్‌పై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించామన్నారు.
ఐదు పోలింగ్ బూత్‌ల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. అదనపు ఈవీఎంలు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. శ్రీకాకుళంలో వర్షాల వల్ల స్ట్రాంగ్ రూమ్‌లకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామని, తుఫాన్ కారణంగా నాలుగు జిల్లాలకు ఎన్నికల కోడ్ నుంచి సీఈసీ మినహాయింపు ఇచ్చిందని పేర్కొన్నారు. కౌంటింగ్ ప్రక్రియ కోసం ఈ నెల 7న సిబ్బందికి ట్రైనింగ్ ఇస్తున్నామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment