ఫ్యాన్ తుఫాన్ వేగంతో తిరిగింది. ఆ ధాటికి సైకిల్ తునాతునకలైంది. ప్రభుత్వంపై జనం కురిపించిన అభిమానం.. ప్రతిపక్షంలోని ఉద్ధండ నాయకులను సైతం మట్టి కరిపించింది. మైకుల ముందు, సోషల్ మీడియా వేదికల్లో రెచ్చిపోయే టీడీపీ నాయకుల అసలు బలమెంతో ఈ ఎన్నికలతో తేలిపోయింది. పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఆల్‌టైమ్ రికార్డు సాధించింది. అపురూపమైన పథకాలతో అద్భుత పాలన అందిస్తున్న వైఎస్ జగన్ సర్కారుపై సిక్కోలు జనం ఓట్ల రూపంలో ప్రేమను కురిపించారు.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : గెలుపంటే ఇదీ.. అనే రీతిలో వైఎస్సార్‌సీపీ ప్రాదేశికాలను చేజిక్కించుకుంది. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో విజయబావుటా ఎగురవేసింది. వైఎస్సార్ సీపీ ప్రభంజనం ముందు టీడీపీ ఏమాత్రం నిలవలేకపోయింది. పంచాయతీ, పురపాలక ఎన్నికల కంటే ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. జిల్లా చరిత్రలో ఎన్నడూ లేనంతగా అత్యధిక ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్ సీపీ గెలవడంతో పాటు ఎన్నికలు జరిగిన 37 జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది. ఎంపీపీ స్థానా లు కూడా వైఎస్సార్ సీపీ వశమవుతున్నాయి. దీంతో జిల్లా రాజకీయ ముఖ చిత్రంలో కొత్త అధ్యా యం లిఖించినట్టైంది.
తిరుగులేని విజయం..
దశాబ్దాలుగా సిక్కోలు టీడీపీకి కంచుకోటగా ఉంది. అలాంటి జిల్లాలో 37 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగితే అన్నింటినీ వైఎస్సార్ సీపీ గెలుచుకుని రికార్డు సృష్టించింది. అలాగే 667 ఎంపీటీసీ స్థానాలకు గాను ఏకగ్రీవాలతో కలుపుకుని 559 స్థానాలను వైఎస్సార్‌సీపీ గెలుచుకుంది. రెండు స్థానాల్లో స్వతంత్రులు ఏకగ్రీవమయ్యారు. టీడీపీ 81 స్థానా లకే పరిమితమైంది. ఇతరులు 12 స్థానాలను కైవసం చేసుకున్నారు. ఇందులో జనసేన, బీజేపీలు ఒక్కో స్థానానికి మాత్రమే పరిమితమయ్యాయి.
11 స్థానాల్లో ఎన్నికలు జరగలేదు. మిగిలిన రెండు స్థా నాల్లో రీపోలింగ్ జరగనుంది. మొత్తానికి 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 10 అసెంబ్లీలకు గాను ఎనిమిది దక్కించుకున్న వైఎస్సార్‌సీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మరింత పుంజుకుంది. పార్టీ రహితంగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా 81.61శాతం సర్పంచ్ స్థానాలను గెలుచుకున్న వైఎ స్సార్‌సీపీ, పార్టీ గుర్తుపై జరిగిన మున్సిపల్ ఎన్నికలో 74.32శాతం స్థానాలను కైవసం చేసుకుంది. తాజాగా పరిషత్ ఎన్నికల్లో 84.40 శాతం స్థానాలను ఎగరేసుకుపోయింది. జెడ్పీటీసీ స్థానాల్లోనైతే 100 శాతం విజయాలను సాధించింది.
ఆల్‌టైమ్ రికార్డు
సిక్కోలు రాజకీయ చరిత్రను వైఎస్సార్‌సీపీ తిరగరాసింది. జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల విషయంలో స్వీప్ చేసి సరికొత్త రికార్డును సృష్టించింది. ఇన్ డైరెక్ట్ ఎన్నికలు జరిగాక పూర్తి స్థాయిలో విజయం సాధించిన పార్టీ గతంలో ఏ ఒక్కటీ లేదు. ఒక్క వైఎస్సార్‌సీపీకే ఆ ఘనత దక్కింది. 1995లో తొలిసారి ఇన్ డైరెక్ట్ ఎన్నికలు జరగ్గా 38 జెడ్పీటీసీ స్థానాలకు టీడీ పీ 34, కాంగ్రెస్ నాలుగు దక్కించుకున్నాయి. 2001 లో టీడీపీ 31, కాంగ్రెస్ ఏడు స్థానాలను కైవసం చేసుకున్నాయి. 2006లో కాంగ్రెస్‌కు 32, టీడీపీకి 6 దక్కాయి. 2014లో టీడీపీకి 22రాగా, వైఎస్సార్‌సీపీకి 16 వచ్చాయి. కానీ ఈ సారి ఎన్నికలు జరిగిన 37 స్థానాలను వైఎస్సార్‌సీపీ స్వీప్ చేసింది. అంతేకాదు 38 మండల పరిషత్‌లను దక్కించుకుంది.
బోణీ కొట్టని టీడీపీ
ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి ఎనిమిది మండలాల్లో టీడీపీ బోణీ కొట్టలేకపోయింది. నరసన్నపేట, అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి, నందిగాం, పలాస, భామిని, సీతంపేట, మందస, పాతపట్నంలో ఒక్క ఎంపీటీసీ స్థానాన్ని కూ డా టీడీపీ గెలుచుకోలేకపోయింది. ఇక జి.సిగడాం, కవిటి, జలుమూరు, సారవకోట మండలాల్లో ఒక్కో ఎంపీటీసీ స్థానానికే పరిమితమైంది. విశేషమేమిటంటే ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ సొంత ఎంపీటీసీ స్థానమైన కవిటి–2లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. మరో 14 మండలాల్లో టీడీపీ రెండేసి స్థానాలను మాత్రమే దక్కించుకుంది.
భారీ మెజారిటీలు..
ఎమ్మెల్యేల కంటే కొందరు ప్రాదేశిక అభ్యర్థులకు ఎ క్కువ మెజారిటీ రావడం విశేషం. రేగిడి జెడ్పీటీసీగా 22,798ఓట్ల మెజార్టీతో వైఎస్సార్‌సీపీకి చెందిన పాలవలస ఇందుమతి, టెక్కలి జెడ్పీటీసీ స్థా నం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దువ్వాడ వాణి అత్యధికంగా 22,732 ఓట్ల మెజార్టీతో, నందిగాంలో వైఎ స్సార్‌సీపీ అభ్యర్థి పేరాడ భార్గవి 20 వేల ఓట్ల ఆధిక్యతతో, పాతపట్నం జెడ్పీటీసీ స్థానం నుంచి వైఎస్సార్‌సీపీకి చెందిన మామిడి మహాలక్ష్మి 16,328 ఓట్ల తేడాతో గెలిచారు. వైఎస్సార్‌సీపీ నుంచి విజ యం సాధించిన వారిలో అత్యధిక మంది 10వేలకు పైగా మెజార్టీతో గెలిచినవారే. పిరియా విజయ, ధర్మాన కృష్ణచైతన్య తదితరులు కూడా మంచి ఆధిక్యతను కనబరిచారు.
ప్రజల గుండెల్లో వైఎస్ జగన్
రాష్ట్రంలో ప్రజాతీర్పు ముందు ప్రతిపక్షాల కుట్రలు తేలిపోయా యి. ఈ ఎన్నికల ఫలితాలతో ప్రజల గుండెల్లో సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్థానం ఏమిటో మరోసారి రుజువైంది. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ హవా స్పష్టంగా కనిపించింది. పోటీ చేస్తే ఘోరమైన ఫలితాలు వస్తాయని ముందే ఊహించి టీడీపీ పారిపోయింది. చాలా చోట్ల టీడీపీ నాయకుల పిలుపును కింది స్థాయి కార్యకర్తలు పట్టించుకోలేదు. పోటీ చేసి బోర్లా పడ్డారు. ప్రజలంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని గుండెల్లో పెట్టుకున్నారు.
– ధర్మాన కృష్ణదాస్, డిప్యూటీ సీఎం
జగన్ పాలనకు నిదర్శనం
రాష్ట్రంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అందిస్తున్న పాలనకు నిదర్శనమే పరిషత్ ఎన్నికల్లో జనం ఇచ్చిన తీర్పు . మంచి పాలనకు జనం మంచి తీర్పు ఇచ్చా రు. ప్రజాస్వామ్యంలో ప్రజలే శక్తివంతులు. ఈ ఫలితాలతో ప్రతిపక్షం విమర్శలు పస లేనివిగా తేలిపోయాయి. న్యాయవ్యవస్థ సరైన సమయంలో తీర్పునిచ్చి ప్రజలకు న్యాయం చేసింది. ఆమదాలవలస నియోజకవర్గంలో నాలుగు మండలాలు, జెడ్పీటీసీ స్థానాన్ని సైతం వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది.
– తమ్మినేని సీతారాం, స్పీకర్
అభాసుపాలైన టీడీపీ..
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చే యడం లేదంటూ తో క ముడిచినట్లు నటించిన తెలుగుదేశం పా ర్టీ పోటీ చేసి ఓడిపోయి అభాసుపాలైంది. రెండేళ్ల పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి లభించడం మన అదృష్టం.
– డాక్టర్ సీదిరి అప్పలరాజు,
రాష్ట్ర పశుసంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment