రాష్ట్రంలో జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ పోలింగ్ సందర్భంగా ఎన్నికల విధులను సక్రమంగా నిర్వర్తించడంలో విఫలమైన అధికారులపై విచారణ కొనసాగుతోంది. నెల్లూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో జరిగిన నాలుగు ఘటనల్లో అవకతవకలపై సంబంధిత ఎన్నికల సిబ్బందిపై వేటుకు రంగం సిద్ధమైంది. ఈ ఘటనలపై మూడు జిల్లాల కలెక్టర్ల నుంచి ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఇప్పటికే నివేదికలు తెప్పించుకున్నారు.