ఈవీఎంలను హ్యాకింగ్ లేదా ట్యాంపరింగ్ చేయడం అసాధ్యమని ఐటీ నిపుణుడు సందీప్ రెడ్డి తెలిపారు. కొందరు కావాలనే పనికట్టుకుని ఈవీఎంలపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన తెలిపారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను డీ కోడ్ చేయడం కష్టతరమని సందీప్ రెడ్డి స్పష్టం చేశారు. ఈవీఎం మిషన్లలో ఎలాంటి డివైజ్ డ్రైవర్స్‌ను ఇన్‌స్ట్రాల్ చేయలేరని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సంఘం వివిధ దశల్లో పరిశీలించిన తర్వాతే ఈవీఎంలను వినియోగిస్తున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.