కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ)తో 22 విపక్ష పార్టీలు సోమవారం సమావేశమయ్యాయి. కౌంటింగ్‌కు ముందుగా ఈవీఎంల్లో పోలైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చాలని కోరాయి. ఒక్కో నియోజకవర్గంలో 5 పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలు, వీవీప్యాట్ స్లిపులను ముందుగా లెక్కించి అవి సరిపోలితే, మిగిలిన అన్ని కేంద్రాల్లో కేవలం ఈవీఎంలను లెక్కించి గెలుపోటములను నిర్ధారించవచ్చని సూచించాయి.