రీ-పోలింగ్‌పై సీఈవో ద్వివేదీ వీడియో కాన్ఫరెన్స్‌ | AP CEO Dwivedi Holds Video Conference With collectors | Sakshi
Sakshi News home page

రీ-పోలింగ్‌పై సీఈవో ద్వివేదీ వీడియో కాన్ఫరెన్స్‌

Published Fri, May 3 2019 12:26 PM | Last Updated on Wed, Sep 18 2019 2:52 PM

AP CEO Dwivedi Holds Video Conference With collectors - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రీ పోలింగ్‌ జరిగే జిల్లాల అధికారులతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సోమవారం జరగనున్న రీ పోలింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లుపై చర్చించారు. ఈ కాన్ఫ్‌రెన్స్‌లో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలో రెండు, ప్రకాశంలో ఒకటి, నెల్లూరు జిల్లాలో రెండుచోట్ల ఈ నెల 6న రీ పోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన విషయం తెలిసిందే. పోలింగ్‌ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ జరగనుంది.

ఆంధ్రప్రదేశ్‌లో రీ పోలింగ్‌ జరిగే బూత్‌ల వివరాలు:

  • గుంటూరు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ పరిధి కేసానుపల్లి గ్రామంలో 94వ కేంద్రం
  • గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నల్లచెరువు 244వ కేంద్రం
  • నెల్లూరు జిల్లా కొవ్వూరు అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలో ఇసుకపల్లిపాలెంలోని బూత్‌ నంబర్‌ 41
  • సూళ్లూరుపేట సెగ్మెంట్‌ పరిధిలో అటకానితిప్ప బూత్‌ నంబర్‌ 197లో కేవలం పార్లమెంట్‌ స్థానానికి మాత్రమే
  • ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పరిధిలో కలనూతలలోని 247వ బూత్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement