
సాక్షి, అమరావతి: సర్వీసు నిబంధనల ప్రకారం బదిలీలు, సస్పెన్షన్లు పనిష్మెంట్ కాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రతి ఉద్యోగి సర్వీసులో చేసే బదిలీలకు ఎటువంటి కారణాలు తెలపరని, కేవలం పనిష్మెంట్ విధించేటప్పుడు మాత్రమే వారి నుంచి వివరణ కోరతారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ దివ్వేది తెలిపారు. రాష్ట్రంలో ముగ్గురు ఐపీఎస్‌ల బదిలీలపై వివాదం నెలకొన్న తరుణంలో దివ్వేది వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గురువారం సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముగ్గురు ఐపీఎస్‌ల బదిలీలకు ఎటువంటి కారణాలు వివరించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు చేసే ఆరోపణలను పరిగణనలోకి తీసుకుంటే విచారణ జరిగేదన్నారు. జీతం ఆపేయడం, ఇంక్రిమెంట్ కోత కోయడం, హోదా స్థాయిని తగ్గించడం వంటివి శిక్షల కిందకు వస్తాయి కానీ, ప్రభుత్వ సర్వీసుల్లో బదిలీలు అన్నవి అత్యంత సాధారణ అంశమని వివరించారు.
బదిలీ చేస్తే గౌరవానికి ఎలా భంగం కలుగుతుందో తనకైతే అర్థం కావటం లేదన్నారు. రాష్ట్రంలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి అదనపు పోలీసు బలగాలు అవసరమవుతాయని దివ్వేది తెలిపారు. బెయిల్ రద్దు అనే అంశం ఎన్నికల సంఘం పరిధిలోకి రాదని, ఇందుకోసం కోర్టులను ఆశ్రయించాలని ద్వివేది స్పష్టం చేశారు. బుధవారం తెలుగుదేశం నేతలు ప్రతిపక్ష నేత జగన్‌మోహన్ రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment