
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రూ.1,168.28 కోట్లను విడుదల చేస్తూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది బుధవారం ఉత్తర్వులిచ్చారు. 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండో విడత రాష్ట్రానికి విడుదల చేయాల్సిన నిధులను కేంద్రం ఆ ఆర్థిక ఏడాది విడుదల చేయలేదు. ఆ నిధులను ఇప్పుడు కేంద్రం రాష్ట్రానికి విడుదల చేయడంతో వాటిని ఆయా గ్రామ పంచాయతీలకు విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment