సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి సీపీఐ నేత రామకృష్ణ శనివారం లేఖ రాశారు. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆయన తన లేఖలో విజ్ఞప్తి చేశారు. అనంతపురం లోక్‌సభ స్థానానికి తన కుమారుడు పవన్ పోటీ చేస్తే.. రూ.50 కోట్లు ఖర్చయింది, ఒక్కో ఓటుకు రూ.2వేలు ఇచ్చామన్న జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని, ఈసీ, అనంతపురం, గుంటూరు జిల్లా కలెక్టర్లు ఇప్పటివరకూ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ద్వివేది దృష్టికి తెచ్చారు. అనంతపురం లోక్‌సభ స్థానం ఎన్నికల ఫలితాలను ప్రకటించరాదని, జేసీ నుంచి సాక్షులకు భద్రత కల్పించాలని రామకృష్ణ తన లేఖలో కోరారు.
చదవండి: ఓటుకు రూ. రెండు వేలు ఇచ్చాం : జేసీ
కాగా ఎన్నికల్లో గెలవడానికి కోట్లాది రూపాయలు ఖర్చుచేశామని జేసీ బహిరంగంగానే వ్యాఖ్యానించడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఐ పార్టీలు ఆయనపై ఈసీకి ఫిర్యాదు చేశాయి. ఈసీ ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన అనంతపురం జిల్లా తాడిపత్రి రిటర్నింగ్ అధికారి.. జేసీ దివాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తాయని నిర్ధారించిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment