ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న లబ్ధిదారులకు వచ్చే నెలలో పింఛన్‌ | Two-months pension to beneficiaries who trapped in other states is next month | Sakshi
Sakshi News home page

ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న లబ్ధిదారులకు వచ్చే నెలలో పింఛన్‌

Published Sat, Apr 4 2020 4:13 AM | Last Updated on Sat, Apr 4 2020 4:13 AM

Two-months pension to beneficiaries who trapped in other states is next month - Sakshi

సాక్షి, అమరావతి: లాక్‌డౌన్‌ కారణంగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయి ఏప్రిల్‌ 1, 2, 3 తేదీల్లో పింఛన్‌ తీసుకోలేకపోయిన వారికి వచ్చే నెలలో రెండు నెలల పింఛన్‌ ఒకేసారి తీసుకునే అవకాశం కల్పించినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టత ఇచ్చారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ట్విట్టర్‌లో స్పందించారు. ఈ నెలలో పింఛన్‌ తీసుకోలేకపోయిన వారు ఆందోళన చెందాల్సిన పనిలేదని, అలాంటి వారికి మే నెలలో రెండు నెలల పింఛన్‌ కలిపి ఇవ్వాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని పేర్కొన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement