
సాక్షి, అమరావతి: ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై కేసు నమోదు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కోరారు. బుధవారం సాయంత్రం వైఎస్సార్‌సీపీ నాయకులు బాలశౌరి, నాగిరెడ్డి, గౌతమ్‌రెడ్డిలు ద్వివేదికి పలు అంశాలపై ఫిర్యాదు చేశారు. రాప్తాడు, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో టీడీపీ అరాచకాలకు పాల్పడే అవకాశం ఉందని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ రెండు నియోజకవర్గాల్లో ప్రత్యేక భద్రతా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు ఎన్నికల అధికారి ఎదుట ఆందోళన చేయడం ఓ పెద్ద డ్రామా అని బాలశౌరీ తెలిపారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే చంద్రబాబు ఈసీని కలిసి అనవసర రాద్ధాంతం చేశారని విమర్శించారు. చంద్రబాబు నియమించుకున్న అధికారులపై ఆరోపణలు రుజువై బదిలీవేటు పడితే ఈసీని నిందించటం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. చంద్రబాబు తీరు దొంగే దొంగ అన్న చందంగా ఉందని ఆరోపించారు. చంద్రబాబుకు ప్రజాస్వామ్యమన్నా, ఎన్నికల సంఘమన్నా లెక్కలేదని అన్నారు. ఏపీలో గురువారం జరిగే ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసే చంద్రబాబు డ్రామాలకు తెరలేపారని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment