Bala Shourie
-
తనకు కావాల్సిన వారినే కలెక్టర్లుగా పెట్టుకున్నారు..
సాక్షి, తిరుపతి: తనకు కావాల్సిన వారినే చిత్తూరు, గుంటూరు జిల్లాల కలెక్టర్లుగా నియమించుకొని, ఆ జిల్లాల్లో ఏకగ్రీవాలను హోల్డ్‌లో పెట్టాలనడం ఎస్ఈసీ స్థాయికి సరికాదని ఎమ్మెల్యే రోజా మండి పడ్డారు. చంద్రబాబు డైరెక్షన్లోనే నిమ్మగడ్డ ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆమె ధ్వజమెత్తారు. అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న నిమ్మగడ్డ.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, రాజ్యాంగం కల్పించిన అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. నిమ్మగడ్డకు తనపై తనకే నమ్మకం లేదని, ఆయన చేతిలో అధికారం పిచ్చోడి చేతిలో రాయి అన్న చందంగా ఉందని ఆమె ఎద్దేవా చేశారు. ఇదిలా ఉండగా వైఎస్సార్సీపీ నేత మర్రి రాజశేఖర్ ఎస్ఈసీ కార్యదర్శి కన్నబాబును కలిసి, ఓటర్ల జాబితాపై ఎస్ఈసీ తరఫు న్యాయవాది హైకోర్టుకు తప్పుడు సమాచారమిచ్చారని ఫిర్యాదు చేశారు. గతేడాది అప్డేట్ చేసిన ఓటర్ల జాబితాతోనే ఎన్నికలు జరపాలని ఎస్ఈసీ నిర్ణయించినట్లు తెలుస్తోందని ఆరోపించారు. 2019 జనవరి వరకు ఉన్న ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకున్నామని, ఎస్ఈసీ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపడంలో ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు. హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చిన ఎస్ఈసీ న్యాయవాదిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ-వాచ్ యాప్ టీడీపీ ఆఫీసులో తయారైందనే అనుమానం ఉంది: బాలశౌరి న్యూఢిల్లీ: ఎస్ఈసీ ప్రవేశపెట్టిన ఈ-వాచ్ యాప్‌పై అనేక సందేహాలున్నాయని వైఎస్సార్సీపీ ఎంపీ బాలశౌరీ అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఈ యాప్ టీడీపీ ఆఫీసులో తయారైందనే అనుమానం కలుగుతోందని అన్నారు. యాప్ ఎక్కడ తయారైందో వెంటనే విచారణ చేపట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ఎంపీ పదవులే ఏకగ్రీవాలవుతుంటే, ఎస్ఈసీ సర్పంచ్ల ఏకగ్రీవాలను హోల్డ్‌లో పెట్టాలనడం సరికాదని హితవు పలికారు. చంద్రబాబు కనుసన్నల్లో నడుస్తూ, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న నిమ్మగడ్డ.. హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబును నమ్మిన వారెవరూ చరిత్రలో బాగుపడినట్లు లేదని ధ్వజమెత్తారు. -
ప్రకాశం బ్యారేజీలోకి తగ్గిన వరద ఉధృతి
సాక్షి, అమరావతి: గతవారం రోజుల పాటు మహోగ్ర రూపం దాల్చిన కృష్ణమ్మ క్రమేణా శాంతిస్తోంది. ఆదివారం ఉదయం ప్రకాశం బ్యారేజీలోకి వచ్చే వరద ప్రవాహం 6.26 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. బ్యారేజీలో నిల్వ సామర్థ్యం కంటే అధికంగా నీరు ఉండటంతో 70 గేట్లు ఎత్తి 6 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల్లో శనివారం వరద ప్రవాహం తగ్గిన నేపథ్యంలో ఆదివారం నుంచి ప్రకాశం బ్యారేజీ వద్ద తగ్గింది. పశ్చిమ కనుమల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కృష్ణా నదిలో ఎగువన వరద ప్రవాహం క్రమేణా తగ్గుతోంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రస్తుతం 12 అడుగుల నీటిమట్టంతో 3.07 టీఎంసీ నీరు నిల్వ ఉంది. దీంతో కృష్ణా కాలువలకు నీటిని విడుదల చేస్తున్నారు. తూర్పు డెల్టాకు 9467, పశ్చిమ డెల్టాకు 8వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆదివారం సాయంత్రానికి వరద ప్రవాహం ఆరు లక్షల క్యూసెక్కులకు తగ్గే అవకాశం ఉన్నట్లు బ్యారేజీ కన్జర్వేటర్ తెలిపారు. దీంతో ముంపు ప్రాంతాల్లో వరద నీరు తగ్గుతోంది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు లోతట్టు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. నేడు మరోసారి మంత్రులు అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే పర్యటన.. పెనమలురు ముంపు గ్రామాల్లో ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్య కొలుసు పార్థసారధి ఆదివారం ఉదయం పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని వారు పరిశీలించారు. వరద బాధితులకు అందుతున్న సహాయ చర్యలపై ఆరా తీశారు. పునరావాసాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ముంపు ప్రాంతాల బాధితులను అన్ని విధాలా ఆందుకుంటామని ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు. కరకట్ట వద్ద రిటర్నింగ్ వాల్‌ను నిర్శించాలని అక్కడి స్థానికులు ఎంపీ, ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన వారు సీఎం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. -
‘చంద్రబాబుపై కేసు నమోదు చేయాలి’
సాక్షి, అమరావతి: ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై కేసు నమోదు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కోరారు. బుధవారం సాయంత్రం వైఎస్సార్సీపీ నాయకులు బాలశౌరి, నాగిరెడ్డి, గౌతమ్‌రెడ్డిలు ద్వివేదికి పలు అంశాలపై ఫిర్యాదు చేశారు. రాప్తాడు, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో టీడీపీ అరాచకాలకు పాల్పడే అవకాశం ఉందని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ రెండు నియోజకవర్గాల్లో ప్రత్యేక భద్రతా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు ఎన్నికల అధికారి ఎదుట ఆందోళన చేయడం ఓ పెద్ద డ్రామా అని బాలశౌరీ తెలిపారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే చంద్రబాబు ఈసీని కలిసి అనవసర రాద్ధాంతం చేశారని విమర్శించారు. చంద్రబాబు నియమించుకున్న అధికారులపై ఆరోపణలు రుజువై బదిలీవేటు పడితే ఈసీని నిందించటం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. చంద్రబాబు తీరు దొంగే దొంగ అన్న చందంగా ఉందని ఆరోపించారు. చంద్రబాబుకు ప్రజాస్వామ్యమన్నా, ఎన్నికల సంఘమన్నా లెక్కలేదని అన్నారు. ఏపీలో గురువారం జరిగే ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసే చంద్రబాబు డ్రామాలకు తెరలేపారని ఎద్దేవా చేశారు. -
బాబు ఈవెంట్ మేనేజర్‌గా నిరూపించుకున్నారు..
సాక్షి, విజయవాడ: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈవెంట్ మేనేజర్‌గా మరోసారి నిరూపించుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈసీ కార్యాలయం వద్ద చంద్రబాబు డ్రామాలు ఆడారని ఆరోపించారు. ధర్నా పేరుతో చంద్రబాబు హంగామా సృష్టించారని తెలిపారు. చంద్రబాబు డ్రామాలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈసీని కలవడంపై చంద్రబాబు తొలుత ముఖ్యమంత్రిగా కలిశానని.. ఆ తర్వాత పార్టీ అధినేతగా కలిశానని పొంతన లేని మాటలు మాట్లాడుతన్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పోలీసులతో నెట్టించుకోని.. వడదెబ్బతో పడిపోయే విధంగా డ్రామా చేస్తారని ఆరోపించారు. చంద్రబాబు హైకోర్టు ఆదేశాలను సైతం ధిక్కారించారని తెలిపారు. ఎన్నికల సంఘం నిర్ణయాలను చంద్రబాబు తప్పుపడుతున్నారని మండిపడ్డారు. -
‘ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే జగన్ రావాల్సిందే’
సాక్షి, మచిలీపట్నం : బందరు పోర్టు త్వరితగతిన పూర్తి కావాలన్నా, ప్రజా సమస్యలు పరిష్కారం లభించాలన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావల్సిందేనని జనమంతా భావిస్తున్నారని వైఎస్ఆర్సీపి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి బాలశౌరి స్పష్టం చేశారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. మచిలీపట్నంలో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని నాని తో కలిసి పలు వార్డుల్లో రోడ్ షో తో విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంచినీటి సమస్య, పారిశుద్ధ్య లోపంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు చంద్రబాబు నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ఎన్నికలప్పుడే చంద్రబాబుకు ప్రజలు గుర్తోస్తారని, డబ్బులు పంచి ఓట్లను కొనుగోలు చేసి రాజకీయంగా లబ్ధి పొందిన తర్వాత ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో పోలీసుల ద్వారా ఓటర్లకు డబ్బులు పంచి లబ్ది పొందేందుకే ఇంటలిజెన్స్ డిజి వెంకటేశ్వరరావు బదిలీని రాజకీయం చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలంతా గట్టి గుణపాఠం చెప్పేందుకు కంకణబద్దులై ఉన్నారని తెలిపారు. వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి రాగానే బందరు పోర్టు ను పూర్తి చేసి స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. కృష్ణాడెల్టాకు రెండు పంటలకు సాగునీరు, అన్ని గ్రామాలకు తాగునీరు అందించడంతో పాటు ప్రత్యేక హోదా సాధించి తీరుతామన్నారు. -
వైఎస్ఆర్సీపీ నేత బాలశౌరిపై దాఖలైన పిటిషన్ కొట్టివేత
హైదరాబాద్: నెల్లూరులో బాలశౌరి చెందిన కంపెనీకి జరిపిన భూకేటాయింపులపై దాఖలైన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత బాలశౌరీకి జరిపిన భూకేటాయింపులపై వరప్రసాద్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ దర్యాప్తు అంటూ ప్రతీ ఒక్కరూ హైకోర్టును ఆశ్రయించడంపై హైకోర్టు తప్పపట్టింది. గతంలో సీబీఐకి అధికారాలు లేవని గౌహతి కోర్టు స్పష్టం చేసిన విషయాన్ని పిటిషనర్ దృష్టికి తీసుకువచ్చింది. సీబీఐకి ఏం అధికారముందని హైకోర్టు ప్రశ్నించింది. ఏమైనా అభ్యంతరాలుంటే స్థానిక పోలీసులను ఆశ్రయించాలని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది. -
'2009 తర్వాత టీడీపీ 35 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది'
గుంటూరు: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్సీపీ గుంటూరు పార్లమెంటరీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు నిజంగా విజన్ ఉన్న నాయకుడైతే తన 9ఏళ్ల పాలనలో పులిచింతల ప్రాజెక్ట్ ఎందుకు నిర్మించలేదని బాలశౌరీ ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీని ప్రజలు పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రజల విశ్వాసం కో్ల్పోయిందనడానికి 2009 సాధారణ ఎన్నికల తర్వాత జరిగిన 53 అసెంబ్లీ ఎలక్షన్లలో 35 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ డిపాజిట్లు కోల్పోయిందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో జరిగిన అన్ని స్థానాల్లో ఓటమిపాలైంది టీడీపీ కాదా? అని బాలశౌరీ నిలదీశారు. రాబోయే కాలంలో రాష్ట్రానికి ఒక దశాదిశను నిర్దేశించగల నేత ఒక్క జగనేనని బాలశౌరీ అన్నారు. దివంగత నేత వైఎస్ఆర్ సంక్షేమ పథకాలు పేద ప్రజలకు చేరాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని ఆయన విశ్వాసం ప్రకటించారు.