వైఎస్ఆర్సీపీ నేత బాలశౌరిపై దాఖలైన పిటిషన్ కొట్టివేత
హైదరాబాద్: నెల్లూరులో బాలశౌరి చెందిన కంపెనీకి జరిపిన భూకేటాయింపులపై దాఖలైన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత బాలశౌరీకి జరిపిన భూకేటాయింపులపై వరప్రసాద్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు.
సీబీఐ దర్యాప్తు అంటూ ప్రతీ ఒక్కరూ హైకోర్టును ఆశ్రయించడంపై హైకోర్టు తప్పపట్టింది. గతంలో సీబీఐకి అధికారాలు లేవని గౌహతి కోర్టు స్పష్టం చేసిన విషయాన్ని పిటిషనర్ దృష్టికి తీసుకువచ్చింది. సీబీఐకి ఏం అధికారముందని హైకోర్టు ప్రశ్నించింది. ఏమైనా అభ్యంతరాలుంటే స్థానిక పోలీసులను ఆశ్రయించాలని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది.