సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ సీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయటంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. వారిని అడ్డుకునే హక్కు మీకు ఎక్కడిదని హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది. బుధవారం పార్టీ కార్యక్రమానికి హాజరు కావాల్సిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేసిన విషయం తేలిసిందే. దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ వైఎస్సార్ సీపీ నేతలు హౌజ్ అరెస్ట్‌పై లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు. ఎంపీ అవినాష్, సురేష్ బాబు, సుధీర్ రెడ్డిలు ఈ పిటీషన్‌ను ఫైల్ చేశారు.
వైసీపీ నేతలను హౌజ్ అరెస్ట్ చేయలేదని పోలీసులు హైకోర్టుకు తెలిపారు. అయితే పిటీషనర్ తరపు న్యాయవాది ఇందుకు సంబంధించిన ఆధారాలను కోర్టు ముందుంచారు. దీంతో పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర స్ధాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.
చదవండి : పోలీసుల అత్యుత్సాహం: వైఎస్సార్‌సీపీ నేతల హౌజ్ అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment