సాక్షి, హైదరాబాద్ : వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనపై వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ఎల్లుండికి వాయిదా పడింది. కేసులో ప్రతివాదులుగా ఏపీ ప్రభుత్వ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, ఏపీ డీజీపీ, విశాఖపట్టణం పోలీస్ కమిషనర్, ఎయిర్‌పోర్ట్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌ను సుబ్బారెడ్డి తన పిటిషన్‌లో చేర్చారు.
ప్రభుత్వంతో పాటు పోలీసులు కూడా వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసును తప్పదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారని, కేసును రాజ్యంగబద్ధంగా కాకుండా రాజకీయకోణంలో దర్యాప్తు చేస్తున్నారని వైవీ సుబ్బారెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం తర్వాత ప్రాథమిక దర్యాప్తు జరపకుండానే.. డీజీపీ బాధ్యత లేకుండా వ్యవహరించారని ఆయన ప్రస్తావించారు. ఏపీ ప్రభుత్వం, ఏపీ పోలీసులపై తమకు నమ్మకం లేదని, హత్యాయత్నం వెనుక కుట్ర దాగి ఉందనే అనుమానం తమకు ఉందని వైవీ సుబ్బారెడ్డి తాను దాఖలు చేసిన రిట్ పిటిషన్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment