
సాక్షి, అమరావతి: లాక్‌డౌన్ నిబంధనలను సడలించడంతో సహాయ కార్యదర్శి, పైస్థాయి అధికారులు అంతా ప్రతిరోజు సచివాలయంలో విధులకు హాజరు కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదివారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. సహాయ కార్యదర్శి స్థాయి దిగువ ఉద్యోగులు ఆయా విభాగాల్లో 33 శాతం మంది హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి. (నేటి నుంచి.. లాక్‌డౌన్ సడలింపులు)
మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు, ఊపిరి సంబంధిత వ్యాధులు, కిడ్నీ కీమోథెరపీ, రోగనిరోధక శక్తి పెంచుకునే చికిత్స తీసుకునేవారిని విధుల నుంచి తప్పించే అధికారం సంబంధిత శాఖ కార్యదర్శికి వదిలేశారు. గర్భణి ఉద్యోగులు ఇంటి వద్దే ఉండటం మంచిదని సూచించారు. విధులకు హాజరయ్యేవారు సురక్షితంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. కాగా, కరోనా నివారణకు విధించిన లాక్‌డౌన్‌ను కంటైన్‌మెంట్ క్లస్టర్ల ప్రాతిపదికగా సోమవారం నుంచి కొన్ని రకాల సడలింపులిస్తూ ఏపీ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. కంటైన్‌మెంట్ క్లస్టర్లలో మరింత పటిష్టంగా కరోనా కట్టడి చర్యలు చేపట్టనున్నట్టు ప్రకటించింది. (ఎక్కడి వారక్కడే: సీఎం వైఎస్ జగన్)
Comments
Please login to add a commentAdd a comment