మార్చి 29నే రేషన్‌ పంపిణీ | Coronavirus: Ration Distribution On March 29th In AP | Sakshi
Sakshi News home page

మార్చి 29నే రేషన్‌ పంపిణీ

Published Tue, Mar 24 2020 4:51 AM | Last Updated on Tue, Mar 24 2020 8:28 AM

Coronavirus: Ration Distribution On March 29th In AP - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన రేషన్‌ను ఈనెల 29నే ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెల్లరేషన్‌ కార్డుదారులకు బియ్యం, కందిపప్పు ఉచితంగా ఇవ్వనుంది. దీంతోపాటు ఒక్కో కార్డుదారుడికి రూ.వెయ్యి నగదు కూడా అందజేయనున్నట్లు సీఎస్‌ నీలం సాహ్ని సోమవారం ఉత్తర్వులిచ్చారు. కరోనాను నియంత్రించేందుకు ఇప్పటికే సర్కారు బయోమెట్రిక్‌ విధానాన్ని ఎత్తివేసిన సంగతి తెలిసిందే. (ప్రజల కోసమే పోలీస్‌ ఆంక్షలు)

ఉత్తర్వుల్లో ముఖ్యాంశాలు.. 
- ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన బియ్యం, ఒక కేజీ కందిపప్పును కార్డుదారులకు ఉచితంగా ఇస్తున్నాం. 
- వాస్తవానికి ఇవి ఏప్రిల్‌లో ఇవ్వాల్సి ఉంది. కానీ, మార్చి 29నే ఇస్తున్నాం 
- ఉచితంగా రేషన్‌తో పాటు రూ.వెయ్యి నగదు కూడా అందజేస్తున్నాం. 
- ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఔట్‌సోర్సింగ్‌ లేదా కాంట్రాక్టు ఉద్యోగస్తులకు కూడా సకాలంలో వేతనాలు అందిస్తాం. 
- ప్రైవేటు సంస్థలు కూడా విధిగా తమ సిబ్బందికి వేతనాలు చెల్లించాలి. 
- నిబంధనలు అతిక్రమించిన సంస్థలపై చర్యలు తీసుకుంటాం 
- నిత్యావసరాల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులకు గురిచేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement