సాక్షి, అమరావతి: కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్‌ఈసీ నీలం సాహ్ని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కొనసాగింపుపై ఎస్‌ఈసీ కసరత్తు చేస్తున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనీల్ కుమార్ సింఘాల్, వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్, అదనపు డీజీలు డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్, సంజయ్, ఎన్నికల కమిషన్ కార్యదర్శి కన్నబాబు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్‌గా గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్ని.. అనంతరం గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలిశారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియపై గవర్నర్‌తో చర్చించారు. ఎస్‌ఈసీ నీలం సాహ్నిని చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ కలిశారు. మిగిలిన ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఈసీతో సీఎస్ చర్చలు జరిపారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్‌పై ఎస్‌ఈసీ, సీఎస్ చర్చించారు. ఎన్నికల ప్రక్రియను సత్వరం పూర్తిచేయాలని ఎస్‌ఈసీని సీఎస్ కోరారు. రేపు(శుక్రవారం) రాజకీయ పార్టీల నేతలతో ఎస్‌ఈసీ సమావేశం నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment