
ఆటపాక(కైకలూరు): కొల్లేరు పక్షుల కేరింతలు ఎంతగానో ఆకట్టుకున్నాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని కితాబిచ్చారు. కైకలూరు మండలం ఆటపాక పక్షుల విహార కేంద్రాన్ని ఆదివారం కుటుంబసభ్యులతో కలసి ఆమె సందర్శించారు. బోటు షికారు చేస్తూ పెలికాన్, పెయింటెడ్ స్ట్రాక్ పక్షుల అందాలను తిలకించారు. అనంతరం పక్షినమూనా కేంద్రాన్ని సందర్శించారు. కొల్లేరు నైసర్గిక స్వరూపం, పక్షుల జీవిత విశేషాలు, వాతావరణ పరిస్థితులు, ప్రజల జీవన విధానాన్ని సీఎస్‌కు అటవీశాఖ రేంజర్ బి.విజయ వివరించారు. ఆటపాక పక్షుల కేంద్రంలో బోటు షికారు రద్దు చేయడంపై మీడియా ప్రశి్నంచగా.. ఆ విషయమై అటవీ శాఖ పీసీసీఎఫ్ వైల్డ్‌లైఫ్ అధికారితో మాట్లాడానని చెప్పారు.